Ajit Doval | AIతో సైబ‌ర్ నేరాలు మరింత విశృంఖ‌లం: అజిత్ దోవ‌ల్

Ajit Doval జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 'ఫ్రెండ్స్ ఆఫ్ బ్రిక్స్ స‌మావేశంలో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ హెచ్చ‌రిక‌ విధాత‌: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అధునాత‌ సాంకేతికతల రాకతో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతాయ‌ని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎఏ) అజిత్ దోవల్ హెచ్చ‌రించారు. సోషల్ మీడియా సైట్ల ద్వారా అతివాద భావజాల వ్యాప్తి జ‌రుగుతుంద‌ని, యువ‌త‌కు ఇది హాని చేస్తుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. ద‌క్షిణాప్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ 'ఫ్రెండ్స్ ఆఫ్ బ్రిక్స్' […]

  • Publish Date - July 25, 2023 / 08:34 AM IST

Ajit Doval

  • జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ బ్రిక్స్ స‌మావేశంలో
  • జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ హెచ్చ‌రిక‌

విధాత‌: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అధునాత‌ సాంకేతికతల రాకతో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతాయ‌ని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎఏ) అజిత్ దోవల్ హెచ్చ‌రించారు.

సోషల్ మీడియా సైట్ల ద్వారా అతివాద భావజాల వ్యాప్తి జ‌రుగుతుంద‌ని, యువ‌త‌కు ఇది హాని చేస్తుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. ద‌క్షిణాప్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ ‘ఫ్రెండ్స్ ఆఫ్ బ్రిక్స్’ సమావేశంలో దోవల్ మాట్లాడారు.

సైబర్‌ సెక్యూరిటీ నుంచి ఉత్ప‌న్న‌మ‌య్యే సవాళ్లను ఎదుర్కోవడానికి వివిధ‌ సమిష్టి కృషి అవసరమ‌ని చెప్పారు. ప్రత్యేకంగా గ్లోబల్ సౌత్ వనరుల పరిమితులను అధిగమించాల్సిన అవసరం ఉన్న‌ద‌ని తెలిపారు.

ఈ విషయంలో, భారతదేశం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంద‌ని వెల్ల‌డించారు. గ్లోబల్ సౌత్‌తో కలిసి పని చేస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు. సైబర్‌ సెక్యూరిటీ సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. బ్రిక్స్ దేశాలు- బెలారస్, బురుండి, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, కజకిస్తాన్, క్యూబా దేశాల ప్ర‌తినిధులు కూడా చర్చలలో పాల్గొన్నారు.

Latest News