Janhvi Kapoor : వరుస సినిమాలతో జాన్వీ కపూర్ దూకుడు

వరుస సినిమాలతో జాన్వీ కపూర్ దూకుడు.. దేవర సిక్వెల్, రామ్ చరణ్ మూవీ, ఛాల్ బాజ్ రీమేక్‌తో పాటు బాలీవుడ్ ప్రాజెక్టులు సిద్ధం.

Janhvi Kapoor : వరుస సినిమాలతో జాన్వీ కపూర్ దూకుడు

విధాత : హిట్ లు ..ఫెయిల్యూర్స్ తో నిమిత్తం లేకుండా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ గ్లామర్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెలుతుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు అభిమానులను షేక్ చేస్తున్నాయి. ఇటీవలే పరమ్ సుందరిగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలోనూ కనిపించనుంది. ఈ సినిమా ఆక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇషాన్‌ కట్టర్, విశాల్‌ జైత్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న హోం బౌండ్‌లోనూ హీరోయిన్‌గా మెప్పించనుంది. ఈ సినిమాను నీరజ్‌ ఘైవాన్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు.

జాన్వీ కపూర్ కథానాయికగా హిందీ చిత్రం ‘ధడక్‌’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికీ హీరోయిన్ గా మాత్రం ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన జాన్వీకి జూనియర్ ఎన్టీఆర్ దేవరతో ఫర్వాలేదనిపించింది. దేవర సిక్వెల్ తో పాటు మెగాహీరో రామ్ చరణ్ పెద్ధి మూవీలో నటిస్తుంది. త్వరలో శ్రీదేవి నటించిన సూపర్ హిట్ ‘ఛాల్ బాజ్’ చిత్రాన్ని సౌత్, నార్త్ హీరోలతో కలిసి రీమేక్ చేస్తోందట. ఇందులో జాన్వీ తొలిసారి రెండు పాత్రల్లో కనిపించబోతుంది.