Ajith Pawar | మామను బుజ్జగించే పనిలో అజిత్ పవార్.. రెండోసారి భేటీ
Ajith Pawar 24 గంటల వ్యవధిలో రెండోసారి భేటీ అయినా స్పందించని శరద్‌పవార్ ముంబై: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ఆ పార్టీ చీలికవర్గం నేతలు అజిత్ పవార్, సునిల్ ఠాక్రే, ప్రఫుల్ పటేల్ సోమవారం ముంబైలో కలిశారు. గడిచిన 24 గంటల్లో అజిత్ పవార్.. శరద్ పవార్‌ను కలవడం ఇది రెండోసారి కావడం విశేషం. అయితే ఎన్సీపీని ఐక్యంగానే ఉంచాలని ఎన్సీపీ చీఫ్‌ను ఈ సందర్భంగా కూడా అజిత్ కోరినట్లు ప్రఫుల్ మీడియాకు తెలిపారు. అయితే […]

Ajith Pawar
- 24 గంటల వ్యవధిలో రెండోసారి భేటీ
- అయినా స్పందించని శరద్‌పవార్
ముంబై: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ఆ పార్టీ చీలికవర్గం నేతలు అజిత్ పవార్, సునిల్ ఠాక్రే, ప్రఫుల్ పటేల్ సోమవారం ముంబైలో కలిశారు. గడిచిన 24 గంటల్లో అజిత్ పవార్.. శరద్ పవార్‌ను కలవడం ఇది రెండోసారి కావడం విశేషం.
అయితే ఎన్సీపీని ఐక్యంగానే ఉంచాలని ఎన్సీపీ చీఫ్‌ను ఈ సందర్భంగా కూడా అజిత్ కోరినట్లు ప్రఫుల్ మీడియాకు తెలిపారు. అయితే శరద్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు.
“అజిత్, సునిల్, నేను ఈ రోజు వైబీ చవాన్ సెంటర్లో శరద్ పవార్‌ను కలిశాము. ఎన్సీపీని ఎలాగైనా ఐక్యంగా ఉంచాలని మళ్లీ వేడుకున్నాం. మా మాటలు విన్నప్పటికీ శరద్ పవార్ ఏమీ మాట్లాడలేదు’ అని ఆయన తెలిపారు.
ఆదివారం కూడా అజిత్ పవార్ తదితరులు ఎన్సీపీ చీఫ్‌ను కలిసిన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం, మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ చర్య శరద్ పవార్ నేతృత్వంలో పార్టీ నిలువుగా చీలికకు దారితీసింది