Kohli | కోహ్లీతో వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడారు.. ఇప్పుడు అంపైర్లుగా చేస్తున్నారు… వారెవ‌రంటే..!

Kohli: భార‌త క్రికెట్ ఆణిముత్యం విరాట్ కోహ్లీ వ‌ర‌ల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్స్‌లో ఒకరు. ఆయ‌న ఇప్పుడు స‌చిన్ రికార్డ్‌పై క‌న్ను వేసి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. అయితే కోహ్లీతో ఆడిన ఇద్ద‌ర ఆట‌గాళ్లు అంపైర్స్ కాబోతున్నారు.బీసీసీఐ నిర్వ‌హించిన అంపైరింగ్ ప‌రీక్ష‌లో వారిద్ద‌రు ఉత్తీర్ణులు కావ‌డంతో త్వ‌ర‌లో వారిద్ద‌రు అంపైర్లుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మ‌రి వారు ఎవ‌రంటే తన్మయ్ శ్రీవాస్తవ, అజితేష్ అర్గల్. 2008లో విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో అండర్‌-19 ప్రపంచకప్ ఆడారు. అలానే చాంపియ‌న్ టీమ్‌లో కూడా ఉన్నారు. అయితే […]

  • By: sn    latest    Aug 01, 2023 6:26 PM IST
Kohli | కోహ్లీతో వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడారు.. ఇప్పుడు అంపైర్లుగా చేస్తున్నారు… వారెవ‌రంటే..!

Kohli: భార‌త క్రికెట్ ఆణిముత్యం విరాట్ కోహ్లీ వ‌ర‌ల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్స్‌లో ఒకరు. ఆయ‌న ఇప్పుడు స‌చిన్ రికార్డ్‌పై క‌న్ను వేసి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. అయితే కోహ్లీతో ఆడిన ఇద్ద‌ర ఆట‌గాళ్లు అంపైర్స్ కాబోతున్నారు.బీసీసీఐ నిర్వ‌హించిన అంపైరింగ్ ప‌రీక్ష‌లో వారిద్ద‌రు ఉత్తీర్ణులు కావ‌డంతో త్వ‌ర‌లో వారిద్ద‌రు అంపైర్లుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మ‌రి వారు ఎవ‌రంటే తన్మయ్ శ్రీవాస్తవ, అజితేష్ అర్గల్. 2008లో విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో అండర్‌-19 ప్రపంచకప్ ఆడారు. అలానే చాంపియ‌న్ టీమ్‌లో కూడా ఉన్నారు. అయితే 33 ఏళ్ల ఓపెనర్ బ్యాట్స్‌మెన్ తన్మయ్ శ్రీవాస్తవ, 34 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అజితేష్ అర్గల్ నాలుగేళ్ల క్రితం క్రికెట్‌కి వీడ్కోలు ప‌లికారు.

జూన్‌లో అంపైరింగ్ ప‌రీక్ష అహ్మ‌దాబాద్‌లో జ‌ర‌గ‌గా వీరిద్ద‌రు హాజ‌ర‌య్యారు. వీటి ఫ‌లితం జూలై 26న రాగా, వారిద్ద‌రు ఉత్తీర్ణులైన‌ట్టు తేలింది. దీంతో మ‌రి కొద్ది రోజుల‌లో భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో వారు అంపైర్స్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. ఆగస్ట్ 17-19 వరకు అహ్మదాబాద్‌లో బీసీసీఐ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, సెమినార్ జ‌ర‌గ‌నుండ‌గా ,వాటికి అజితేష్, తన్మయ్ హాజరవుతారు. అనంత‌రం బోర్డు నిర్వహించే మ్యాచ్‌లలో అధికారికంగా కనిపిస్తారు. అంపైర్ కావ‌డం ప‌ట్ల త‌న్మ‌య్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. క్రికెట్‌తో బంధం ఏర్ప‌ర‌చుకోవాలని అనుకున్నాను. అంపైరింగ్ ద్వారా ఇది సాధ్య‌మైంది. అంపైరింగ్ ఎంపిక మంచిద‌ని నేను భావిస్తున్నాను.

మ‌రింత ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాను. ఐసీసీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని భావిస్తున్నాను అని త‌న్మ‌య్ అన్నారు. త‌న్మయ్ శ్రీవాస్తవ..ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కాగా, అత‌ను ఆరు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 52.40 సగటుతో 262 పరుగులు చేశాడు. 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడగా, 34.39 సగటుతో 4918 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతనికి 10 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక అజితేష్ అర్గల్ 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 31.29 సగటుతో 24 వికెట్లు తీశాడు. 2008 అండర్-19 ప్రపంచకప్‌లో అజితేష్ బాగా బౌలింగ్ చేసి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ మ్యాచ్‌లో 5 ఓవర్లలో 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నాడు.