Akbaruddin | మా సోదరులిద్దరిని చంపాలని చూస్తున్నారు
మా అన్నదమ్ములను జైలుకు పంపి, జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేయ్యలని చూస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధిన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు
అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
విధాత: మా అన్నదమ్ములను జైలుకు పంపి, జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేయ్యలని చూస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధిన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అక్బరుద్ధిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దేశంలో పరిస్థితులు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయన్నారు. మా ఒవైసీ ఇద్దరు బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్‌తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే తాము ఇలాంటి వాటికి భయపడబోమన్నారు హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని.. అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామే అని అక్బరుద్దీన్ దీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ కొన్ని దుష్టశక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని, కానీ తాను అంత ఈజీగా వెళ్లిపోయేవాడిని కాదన్నారు. అన్నదమ్ములిద్దరు వరుసగా తమను చంపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాతబస్తీ రాజకీయాల్లో తిరుగులేని ఒవైసీ సోదరులు పార్లమెంటు ఎన్నికల వేళ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక మతలబు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram