Allow suicide |
విధాత: ఆత్మహత్య చేసుకోడానికి అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ రిటైర్డ్ బ్రేక్ ఇన్ స్పెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ను కోరిన ఘటన సంచలనం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టిసి బ్రేక్ ఇన్స్పెక్టర్ సయ్యద్ నూరిళ్ల ఉద్యోగంలో కొనసాగిన క్రమంలో గ్రామంలో ఏడెకరాల పొలం కొనుగోలు చేశాడు.
భార్య చనిపోయిన తర్వాత ఆస్తిపై పిల్లలు కన్నేశారు. దీంతో నూరిళ్ల కుటుంబంలో భూముల వివాదం కొనసాగుతుంది. అతడి పిల్లల ప్రమేయం తో రాత్రికి రాత్రి నూరిళ్ల పేరు మీద ఉన్న భూమిని గుట్టుచప్పుడు కాకుండా వేరే వాళ్ల పేరు మీదికి తహశీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారని, తహశీల్దార్ అక్రమ వ్యవహారాన్ని రెండుసార్లు కలెక్టర్ కి విన్నవించినా కూడా న్యాయం జరగలేదని బాధితుడు వాపోయాడు.
తహశీల్దార్ ఉద్దేశపూర్వకంగానే రాత్రి 9 గంటలకు రిజిస్ట్రేషన్ చేసిందని ఆరోపిస్తున్నరు. తన పేరు మీద ఉన్న ఏడెకరాల భూమిని కోల్పోయానని.. ఈ వయసులో జిల్లా కలెక్టర్ ను కూడా రెండుసార్లు కలిసి వినతిపత్రం అందించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తాను చనిపోవడానికి అనుమతి కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశాడు.