Allu Arha: తండ్రులని మించిపోతున్న తనయలు.. నిన్న సితార, నేడు అర్హ
Allu Arha: ఒకప్పుడు స్టార్ హీరోల తనయలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలంటే భయపడేవారు. అందుకు కారణం ఆయా హీరో అభిమానులు పెద్ద ఎత్తున గొడవలు చేయడమే. సూపర్ స్టార్ కృష్ణ తనయగా మంజులకి కూడా సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. సినిమాలలో కథానాయికగా నటించాలని అనుకున్నది .కాని అప్పటి రోజులలో అభిమానుల ఆలోచనల మేరకు హీరోలు నడుచుకునేవారు. మంజుల ఎప్పుడైతే సినిమాల్లో హీరోయిన్ గా వస్తారు అన్న వార్త బయటకు వచ్చిందో దాంతో అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేశారు. […]

Allu Arha: ఒకప్పుడు స్టార్ హీరోల తనయలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలంటే భయపడేవారు. అందుకు కారణం ఆయా హీరో అభిమానులు పెద్ద ఎత్తున గొడవలు చేయడమే. సూపర్ స్టార్ కృష్ణ తనయగా మంజులకి కూడా సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. సినిమాలలో కథానాయికగా నటించాలని అనుకున్నది .కాని అప్పటి రోజులలో అభిమానుల ఆలోచనల మేరకు హీరోలు నడుచుకునేవారు. మంజుల ఎప్పుడైతే సినిమాల్లో హీరోయిన్ గా వస్తారు అన్న వార్త బయటకు వచ్చిందో దాంతో అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేశారు. తమ అసంతృప్తి తెలియజేశారు. దాంతో కృష్ణ తన కూతురిని నటిగా కాకుండా రచన, నిర్మాణం వైపు మొగ్గు చూపేలా ఆమెని ప్రోత్సహించారు.
కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. హీరోల పిల్లలు చిన్నప్పటి నుండే వెండితెరపై సందడి చేస్తున్నారు. అభిమానులు కూడా స్వాగితస్తున్నారు. ఈ క్రమంలో హీరోల పిల్లలు ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై సందడి చేస్తున్నారు. అయితే త్వరలో మహేష్ బాబు కూతురు సితార కూడా వెండితెర ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ , ఆయన భార్య నమ్రత మొదటి నుండి సితారని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. దాంతో సితార.. పదేళ్లకే మాంచి డ్యాన్సర్ గా ప్రూవ్ చేసుకుంటూ, బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారింది. ఇక ఇప్పుడు తన డెస్టినేషన్ అంటుంది సితార. ఇటీవల సితార బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరచింది.
ఇక టాలీవుడ్ మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూతురు అర్హ ఇప్పటికే వెండితెరపై కనిపించి సందడి చేసింది. సమంత ప్రధాన పాత్ర లో రూపొందిన ‘శాకుంతలం’ చిత్రం లో భరతుడిగా కనిపించి అలరించింది.. క్యూట్ డైలాగ్స్ తో అచ్చ తెలుగులో ఎలాంటి తప్పు లేకుండా మాట్లాడడం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అర్హ దేవర సినిమాలో కనిపించనుందంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో అర్హ కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని, ఈ 10 నిమిషాలకు గాను ఆమెకి 20 లక్షల రూపాయిల పారితోషికం ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే ఒక్కో నిమిషానికి అర్హ రెండు లక్షల రూపాయిలు రెమ్యునరేషన్ అందుకుంటుంది. స్టార్ హీరోల తనయల హవా చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.