Allu Arjun | ఆ బ్యూటీకి అల్లు అర్జున్ బౌల్డ్? నెక్ట్స్ సినిమాలో ఛాన్స్ ఇచ్చేసినట్లేనా?

Allu Arjun విధాత‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అందులోని మ్యానరిజం, డైలాగ్స్, పాటలు అటు సెలబ్రిటీలను, ఇటు ప్రేక్షకులను సైతం కట్టి పడేశాయి. వాళ్ళు కూడా పుష్ప డైలాగ్స్ చెబుతూ, మ్యానరిజాన్ని ఫాలో అవుతూ వీడియోలు చేశారు. ఇవన్నీ నెట్టింట వైరల్ అయ్యాయి […]

Allu Arjun | ఆ బ్యూటీకి అల్లు అర్జున్ బౌల్డ్? నెక్ట్స్ సినిమాలో ఛాన్స్ ఇచ్చేసినట్లేనా?

Allu Arjun

విధాత‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అందులోని మ్యానరిజం, డైలాగ్స్, పాటలు అటు సెలబ్రిటీలను, ఇటు ప్రేక్షకులను సైతం కట్టి పడేశాయి.

వాళ్ళు కూడా పుష్ప డైలాగ్స్ చెబుతూ, మ్యానరిజాన్ని ఫాలో అవుతూ వీడియోలు చేశారు. ఇవన్నీ నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. ఇప్పుడు ‘పుష్ప 2’ షూటింగ్ యమా స్వింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ ఓ భామ అందానికి బౌల్డ్ అయ్యాడు. ఎవరా భామ అని అనుకుంటున్నారా?

అల్లు అర్జున్‌ని మలయాళం చిత్ర సీమలో ‘మల్లు అర్జున్’ అంటారనే సంగతి తెలియంది కాదు. అతగాడు చాలా ఏళ్ళ క్రితమే మలయాళ చిత్రసీమలో జెండా పాతేశాడు. ఏ హీరోకీ లేని మార్కెట్ అక్కడ ఈ అల్లు బాబుకి ఉంది. అందుకేనేమో మలయాళం అనగానే కాస్త ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు అల్లు అర్జున్.

తాజాగా విడుదలైన ‘సామజవరగమన’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో నటించిన నటీనటులను మెచ్చుకుంటూ రీసెంట్‌గా ఓ ట్వీటేశాడు అల్లు అర్జున్. ఆ ట్వీట్‌లో ప్రత్యేకించి ఆ సినిమా హీరోయిన్ రెబా మోనికా జాన్‌‌ని అభినందించాడు అల్లు అర్జున్.

‘సామజవరగమన’ సినిమాలో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ కలిసి నటించారు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా టీమ్‌ని పొగుడుతూ.. నటి రెబా మోనికా జాన్‌ని ఉద్దేశించి ‘మై మలయాళీ’ అంటూ అభినందించాడు అల్లు అర్జున్. ఇంకేముంది.. స్టార్ హీరో, అందులోనూ అల్లు అర్జున్ దృష్టిలో ఆ బ్యూటీ పడిందని, ఇక నెక్ట్స్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టేనని సోషల్ మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి.

అల్లు అర్జున్ కూడా ఊరకే రెబా మోనికాని పొగడలేదని, తన నెక్ట్స్ సినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకే అలా అన్నాడని అంటున్నారు. అందుకే ప్రత్యేకంగా ఆమెను మై మలయాళీ అంటూ సంభోధించాడని చూపిస్తున్నారు. మరి నెటిజన్లు భావిస్తున్నట్లుగా జరుగుతుందేమో చూడాలి. ఈ ఐకాన్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న ‘పుష్ప2’ షూటింగ్ పూర్తి కావస్తుంటే.. మరోవైపు త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి కూడా స్క్రిఫ్ట్ వర్క్ మొదలైనట్లుగా తెలుస్తోంది. మరి ఏ సినిమాలో రెబా ఛాన్స్ కొట్టేయనుందో చూడాలి.