Breaking: తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు

విధాత‌, హైద‌రాబాద్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించిన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది కేసీఆర్ సర్కార్ ఈ నేపథ్యంలోనే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అ మేరకు కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడుతూ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కెసిఆర్ […]

  • By: Somu    latest    Sep 15, 2022 10:19 AM IST
Breaking: తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు

విధాత‌, హైద‌రాబాద్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించిన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది కేసీఆర్ సర్కార్ ఈ నేపథ్యంలోనే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

అ మేరకు కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడుతూ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని చెప్పారు.

భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ స్పూర్తి లక్ష్యంగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు కేసీఆర్. అంబేద్కర్ రూపొందించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయిందన్నారు.

ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తుందని కేసీఆర్ తెలిపారు.

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని వెల్లడించారు.

దీనిపై ప్రధానమంత్రికి త్వరలోనే లేఖ రాస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డా. బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

ఇదిలాఉండగా స‌చివాల‌య నిర్మాణ‌పు ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. రాష్ట్ర నూత‌న స‌చివాల‌యం త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ది