అమెరికాలో 19 అడుగుల ‘అంబేద్కర్’.. 14న విగ్రహం ఆవిష్కరణ

న్యూయార్క్: భారత్ వెలుపల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అమెరికాలో ఆవిష్కృతం కానుంది. మేరీల్యాండ్‌లోని అకోకీక్ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో 19 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 14 న ఆవిష్కరిస్తామని అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం (ఏఐసీ) వెల్లడించింది. సమానత్వానికి ప్రతీకగా దీన్ని నిర్మించినట్లు పేర్కొంది. గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందిచడం విశేషం.
అమెరికాలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం భారత్ అమెరికాల సంబంధాలను శక్తివంతం జేస్తుందని, దానికి అది మంచి ప్రతీకగా నిలుస్తుందని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది. భారత్‌లోని అంబేద్కర్ అభిమాన సంఘాలు, అసోసియేషన్లు అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడాన్ని హర్షించాయి. అమెరికా ప్రభుత్వాన్ని అభినందించాయి.