తన న్యూ ఇయర్ గోల్స్‌ను రివీల్ చేసిన ఫైర్ బ్రాండ్ విధాత: తెలుగులో ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ అంటే అనసూయ భరద్వాజ్ పేరు చెప్పుకోవాలి. నా రూటే సపరేటు అన్నట్టుగా ఆమె తాను అనుకున్నది ఎవరేమనుకున్నా తాను చేసి నేనింతే అంటోంది. ఈమె ఎవరి మాటలను లెక్కచేయదు. ఈమె ఎవరు ఏమి చెప్పినా అస్సలు వినదు. తన మనసుకు నచ్చింది చేస్తానని అంటుంది. అనసూయ తనకు నచ్చనివి ఎవరేమనుకున్నా వాటిలో మంచి ఉన్నా సరే ఆమె చేయదు. […]
తన న్యూ ఇయర్ గోల్స్‌ను రివీల్ చేసిన ఫైర్ బ్రాండ్
విధాత: తెలుగులో ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ అంటే అనసూయ భరద్వాజ్ పేరు చెప్పుకోవాలి. నా రూటే సపరేటు అన్నట్టుగా ఆమె తాను అనుకున్నది ఎవరేమనుకున్నా తాను చేసి నేనింతే అంటోంది. ఈమె ఎవరి మాటలను లెక్కచేయదు. ఈమె ఎవరు ఏమి చెప్పినా అస్సలు వినదు. తన మనసుకు నచ్చింది చేస్తానని అంటుంది. అనసూయ తనకు నచ్చనివి ఎవరేమనుకున్నా వాటిలో మంచి ఉన్నా సరే ఆమె చేయదు. నాకు నచ్చింది చేస్తానంటుంది. అందుకే ఈమె ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది.
ప్రతి ఒక్కరితోనూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉంటుంది. నెటిజన్లను, తనను ట్రోల్ చేసేవారిని అస్సలు లెక్క పెట్టదు. అంతేకాదు నువ్వు ఒకటి అంటే నేను నాలుగు అంటానని వారితో తగవు పెట్టుకుంటుంది. ఇక విషయానికి వస్తే అనసూయ భరద్వాజ్ 2023 కొత్త ఏడాదిలో ఒక నాలుగు లక్ష్యాలను నిర్దేశించుకుంది.
అందులో మొదటిది నెగటివ్ మైండెడ్ పీపుల్‌కి దూరంగా ఉండటం. ఎంతసేపటికీ నెగటివ్ ఆలోచనలు చేస్తూ నెగటివ్ మైండ్‌తో మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వారికి దూరంగా ఉండాలని ఆమె భావిస్తోంది. ఒకవేళ తన పక్కన అలాంటి వారు ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ప్రతికూల ప్రభావాలు తన ఆత్మ బలాన్ని దెబ్బతీయకుండా చూసుకోవడంపై తన దృష్టిని సారించింది.
ఇక రెండోది ఏమిటంటే పెద్దలు చెప్పిన ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని ఇకపై ఆమె చాలా జాగ్రత్తగా అమలు చేయనుందట. సరైన ఆహారం తీసుకోవడం, అన్ని విషయాలకు సరైన సమయాన్ని కేటాయించడం, వ్యాయామం చేయడం, బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవడం, ఏదైనా తేడా ఉంటే దానికి కారణాలను కనుక్కొని దానిని సరి చేసుకోవడం పై ఈమె తన దృష్టి కేంద్రీకరించింది.
ఇక తన మూడో ప్రాధాన్యాన్ని ఆమె డబ్బుకు ఇచ్చింది. డబ్బున్న వాడు రాజు కంటే బలవంతుడు. ధనమేరా అన్నిటికీ మూలం ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అనే సూత్రాన్ని పాటించి కిందటి ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువగా తన సంపాదనను పెంచుకోవాలని ఈమె భావిస్తోంది. ఆపదలలో ఆదుకునేది మనీనే కాబట్టి మనీ మేక్ మెనీ థింగ్స్ అన్నట్టుగా ఈమె మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వనుంది. డబ్బుంటే కొండ మీద కోతి అయినా దిగివస్తుంది అనే ఆలోచన ఈమెకి వంటపట్టింది.
ఇక నాలుగవ ప్రాధాన్యం మానసిక ప్రశాంతత. డబ్బు సంపాదనలో పడి మానసిక ఆరోగ్యాన్ని కోల్పోవడం ఇష్టం లేదు. అందుకే పీస్ ఆఫ్ మైండ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలని అంటోంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. మనము కూడా చేయాల్సిన పనులను చక్కగా చేస్తామని భావించిన ఈమె దానికి నాలుగవ ప్రాధాన్యాన్ని కేటాయించింది.
మొత్తానికి అనసూయ చెప్పిన నాలుగు పాయింట్లు నిజ జీవితంలో సరైనవే అనే చెప్పాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ఈ సూత్రాలన్నీ ఆమె ఎప్పటి నుండో పాటిస్తోంది. కామెంట్ చేసే వారిని పట్టించుకోకుండా అవసరమైతే వారిపై ఎదురు దాడి చేస్తుంది. నిత్యం వర్కౌట్ లతో తన బాడీని ఆంటీ వయసులో కూడా 16 ఇయర్స్ బ్యూటీగా మార్చుకుంటోంది.
ఇక మూడోది డబ్బు… ఆమె ఆల్రెడీ డబ్బు తక్కువగా వస్తుందని, సంపాదన తక్కువగా ఉందని భావించే బుల్లితెరకు బై బై చెప్పి కాస్త ఎక్కువ పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించి పెట్టే వెబ్ సిరీస్, సినిమాలపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం ఆమె ఒక్క కాల్ షీట్‌కు మూడు లక్షలకు పైగానే డిమాండ్ చేస్తోందట. అలాగే పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్లకు కూడా హాజరవుతోంది.
అది మహా అయితే రెండు మూడు గంటల పని. కానీ దానికి ఆమె వసూలు చేసే మొత్తం ఏకంగా పది లక్షలు. సినిమాలు, వెబ్ సిరీస్, ప్రమోషన్స్, సోషల్ మీడియా ద్వారా మరింత సంపాదనను ఆశిస్తోంది. మొత్తానికి తాను నిర్దేశించుకున్న కొత్త లక్ష్యాలకు అనుగుణంగా ఆమె ఇప్పటికే తొలి అడుగులు వేస్తోంది కాబట్టి ఈ ఏడాదిలో ఆమె వీటిని మరింత బలంగా చేసుకుని తన స్థాయిని పెంచుకునే ఆలోచనలో ఉంది.