నల్లమద్ది వృక్షం నుంచి ఉప్పొంగిన జలధార.. వీడియో
వృక్షాల నుంచి నీళ్లు ఉప్పొంగడమనేది వింతే.. ఎందుకంటే చెట్ల నుంచి జలధార రావడమనేది అసహజం. వేప చెట్టు నుంచి వేప కల్లును తీస్తారు.
వృక్షాల నుంచి నీళ్లు ఉప్పొంగడమనేది వింతే.. ఎందుకంటే చెట్ల నుంచి జలధార రావడమనేది అసహజం. వేప చెట్టు నుంచి వేప కల్లును తీస్తారు. తాటి, ఈత చెట్ల నుంచి కూడా కల్లును తీస్తారు. కానీ ఈ నల్లమద్ది వృక్షం నుంచి జలధార ఉప్పొంగింది. ఈ అరుదైన దృశ్యం పాపికొండల్లో ఆవిష్కృతమైంది.
అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం
పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు.
నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024
పాపికొండల్లోని కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపులో ఓ నల్లమద్ది వృక్షం నుంచి నీళ్లు వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గమనించారు. దీంతో అధికారులందరూ ఆ చెట్టు వద్దకు వెళ్లారు. ఉన్నతాధికారుల సమక్షంలో చెట్టుకు రంధ్రం చేయగా, నీళ్లు ఉబికి వచ్చాయి. ఓ రేంజ్‌లో నీళ్లు రావడంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నల్లమద్ది వృక్షం నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీళ్లు వస్తాయని అధికారులు వెల్లడించారు.
అయితే నల్లమద్ది వృక్షం చాలా పవర్ ఫుల్. ఇంటి గడపకు, తలుపుల తయారీకి ఈ చెక్కను వినియోగిస్తారు. అంతేకాకుండా కుర్చీలు, మంచాల తయారీకి కూడా ఈ చెక్కను విపరీతంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ కట్టె చాలా గట్టిగా ఉండి, చాలా లైఫ్ ఉంటుంది. కాబట్టి నల్లమద్ది చెక్కకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram