Actress Kalpika: నటి కల్పిక పై మరో కేసు నమోదు!
Actress Kalpika: : నటి కల్పిక పై మరో పోలీస్ కేసు నమోదైంది. ఇన్ స్టాలో తనను అసభ్య పదజాలంతో దూషించిందని కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కల్పికపై కేసు నమోదు చేశారు. ఆన్ లైన్ లో కల్పిక అసభ్యంగా దూషిస్తూ తనను వేధిస్తుందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నటి కల్పికపై పలు సెక్షన్ల కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కల్పిక గత నెల 29న ప్రిజం పబ్‌లో హంగామా సృష్టించింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టడంతో పబ్ యాజమాన్యం ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతో 324(4),352,351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే కల్పిక ఈ ఘటనలో తన తప్పేమి లేదని వాదించింది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram