రేపో మాపో జైలుకు CM జగన్‌.. ష‌ర్మిల‌కే అవ‌కాశాలు: క‌డియం శ్రీ‌హ‌రి

జగన్ సీఎం కావడంలో మీ శ్రమ ఉంది షర్మిలకు ఆంధ్రాలో అవకాశాలు ఆంధ్రాలో ప్రయత్నిస్తే మంచిది వైఎస్ కుటుంబం తెలంగాణ వ్యతిరేకం ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రేపో మాపో ఏపీ సీఎం జగన్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయనీ అప్పుడు ఆంధ్రాలో వైఎస్ షర్మిలకు రాజకీయ అవకాశం దక్కుతుందంటూ.. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్య‌లు చేశారు. ఏమో ఇది జరుగావచ్చు.. సీబీఐ కేసులోనో.. […]

రేపో మాపో జైలుకు CM జగన్‌.. ష‌ర్మిల‌కే అవ‌కాశాలు: క‌డియం శ్రీ‌హ‌రి
  • జగన్ సీఎం కావడంలో మీ శ్రమ ఉంది
  • షర్మిలకు ఆంధ్రాలో అవకాశాలు
  • ఆంధ్రాలో ప్రయత్నిస్తే మంచిది
  • వైఎస్ కుటుంబం తెలంగాణ వ్యతిరేకం
  • ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రేపో మాపో ఏపీ సీఎం జగన్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయనీ అప్పుడు ఆంధ్రాలో వైఎస్ షర్మిలకు రాజకీయ అవకాశం దక్కుతుందంటూ.. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్య‌లు చేశారు. ఏమో ఇది జరుగావచ్చు.. సీబీఐ కేసులోనో.. మీ బాబాయి వివేక హత్య కేసులోనో జగన్ జైలు కెళ్లే అవకాశాలు ఉన్నాయని వైయస్సార్‌టీపీ పేరుతో తెలంగాణలో షర్మిల ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయత్నాలు అక్కడ చేసుకోవడం బెటర్ అంటూ సూచించారు.

షర్మిలకు రాజకియ భవిష్యత్తు తెలంగాణలో కాదు.. ఆంధ్రాలో ఉంది.. రోజురోజుకు జగన్ గ్రాఫ్ అక్కడ తగ్గిపోతుందట.. అప్పుడు నీకు అవకాశం దక్కవచ్చు.. అక్కడ ప్రయత్నించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని కడియం చురక అంటించారు. ప్రస్తుతం తెలంగాణలో చేస్తున్న ప్రయత్నాలు.. పాదయాత్ర, బలం, బలగాల మోహరింపు ఆంధ్రలో చేసుకుంటే సానుకూల ఫలితాలు వస్తాయని హితవు పలికారు. జనగామ జిల్లాలో మంగళవారం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ ఈ హాట్ కామెంట్స్ చేశారు.

మీది తెలంగాణ వ్యతిరేక కుటుంబం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమనీ, ఆ కుటుంబ చరిత్ర అంతా తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయడమేనని కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోద విషయంలో వైఎస్ జగన్, షర్మిల సమైక్య నినాదానికి తెరలేపిన వారని గుర్తు చేశారు.

నష్టపోయింది వాస్తవమే.. మావల్ల కాదు

షర్మిల కుటుంబ పరంగా నష్టపోయింది. ఇది నిజమైన విషయం. అయితే అది మా వల్ల కాదు.. తెలంగాణ వల్ల అసలే కాదు.. నష్టపోయిందంటే తన అన్న జగన్ వల్ల మాత్రమేనని… ఆమెను జగన్ రాజకియంగా దెబ్బ తీసింది కూడా వాస్తవమని.. అవకాశాలు కూడా అక్కడే ఉంటాయని కడియం గుర్తు చేశారు.

తెలంగాణలో వైఎస్ షర్మిలకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అంటూ కడియం ప్రశ్నించారు. సిబిఐ కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు పాదయాత్ర నిర్వహించి ఆ పార్టీని జగన్ ను నిలబెట్టింది మీరేనని గుర్తు చేశారు. తర్వాత జగన్ సీఎం అయ్యాడని వివరించారు. మీకు జగన్‌ను అడిగే హక్కు ఉందంటూ కడియం శ్రీహరి వివరించారు.