AP: ఆంధ్రా పాలిటిక్స్‌లో.. వారసుల ఎంట్రీ! టికెట్ల కోసం పోటీ

విధాత‌: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల వైపు పయనిస్తున్న తరుణంలో వారసుల కోసం తండ్రులు ఆరాటపడుతున్నారు. తమ కుమారులకు టికెట్స్ ఇప్పించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీల్లో నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జగన్ మాత్రం కొందరికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. తండ్రులే పోటీలో ఉండాలని జగన్ చెబుతున్నారు. అధికార వైసీపీ నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, పోచం రెడ్డి నరేన్ రెడ్డి […]

AP: ఆంధ్రా పాలిటిక్స్‌లో.. వారసుల ఎంట్రీ! టికెట్ల కోసం పోటీ

విధాత‌: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల వైపు పయనిస్తున్న తరుణంలో వారసుల కోసం తండ్రులు ఆరాటపడుతున్నారు. తమ కుమారులకు టికెట్స్ ఇప్పించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీల్లో నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జగన్ మాత్రం కొందరికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. తండ్రులే పోటీలో ఉండాలని జగన్ చెబుతున్నారు.

అధికార వైసీపీ నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, పోచం రెడ్డి నరేన్ రెడ్డి తిరుపతి నుంచి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి కుమారుడు,పేర్ని నాని కుమారుడు కిట్టు, బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ ఎన్నికల బరిలో దిగాలని కోరుకుంటున్నారు.

టిడిపి నుండి చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ , గంటా శ్రీనివాస్ కుమారుడు, పొలం రెడ్డి దినేష్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె, కేశినేని నాని కుమార్తె స్వప్న తదితరులు టికెట్లు కోరుతున్నారు

అధికారం ఉన్నప్పుడే వారసులను ప్రొజెక్ట్ చేసుకొని వారిని స్థిరపరచి రాజకీయ వారసత్వము నిలుపుకునే పనిలో ఉన్నారు. వీరి వెనుక తండ్రులు నిలబడి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ పార్టీ ఏ నాయకుడికి టికెట్ ఇస్తుందో చూడాలి..

ఇదిలా ఉండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం తన కుమారుడి టికెట్ ను ప్రకటించుకున్నారు. ఈ సారి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేస్తారు. మిగతా వాళ్ళు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ టికెట్ దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.