Staff Nurse | రేపు 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ

రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన 6,956 మంది స్టాఫ్‌ నర్సులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు.

Staff Nurse | రేపు 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ
  • ఎల్బీ స్టేడియంలో అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Staff Nurse | విధాత: రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన 6,956 మంది స్టాఫ్‌ నర్సులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం స్టాప్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తారు. అధికార యంత్రాంగం ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసే ఉద్ధేశంతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే టీఎస్‌పీఎస్సీని కూడా ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్‌, సభ్యులను నియమించింది.


ఇటు కొత్త వీసీల నియామకానికి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. యూనివర్సిటీల ఖాళీల భర్తీపై దృష్టి పెట్టింది. మెగా డీఎస్సీ కోసం సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించింది. మునుముందు వరుస నోటిఫికేషన్లతో ఉద్యోగ నియమాకాలను చేపట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా ముందడుగు వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నది.