బీజేపీలో చేరిన బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
వరంగల్ జిల్లాకు చెందిన బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మంగళవారం బీజేపీలో చేరారు. వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరూరి రమేశ్‌కు బీజేపీ అధిష్టానం

వరంగల్ ఎంపీ టికెట్ చాన్స్
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
విధాత, హైదరాబాద్ : వరంగల్ జిల్లాకు చెందిన బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మంగళవారం బీజేపీలో చేరారు. వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరూరి రమేశ్‌కు బీజేపీ అధిష్టానం వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆయన కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఇటీవలే బీజేపీలో చేరగా, ఇప్పుడు ఆరూరి రమేశ్ కూడా చేరిపోవడంతో జిల్లాలో బీజేపీ బలపడతుందని కమలనాథులు భావిస్తున్నారు.