Mukesh Ambani | లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అంబానీ
Mukesh Ambani న్యూయార్క్‌లోని ఫ్లాట్ రూ.74 కోట్లకు విక్రయం విధాత: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ న్యూయార్క్‌లోని తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. మాన్‌హట్టన్‌లోని వెస్ట్ విలేజ్‌లో 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాల్గవ అంతస్తులో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను రూ.74 కోట్లకు విక్రయించినట్టు నివేదికలు వెల్లడించాయి. హడ్సన్ నది వ్యూతో ఉన్నఅత్యంత పురాతన, మంచి కళాకృతితో చెక్కతో నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్‌ను అంబానీ విక్రయించారు. ఈ భారీ భవనాన్ని […]
Mukesh Ambani
- న్యూయార్క్‌లోని ఫ్లాట్ రూ.74 కోట్లకు విక్రయం
విధాత: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ న్యూయార్క్‌లోని తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. మాన్‌హట్టన్‌లోని వెస్ట్ విలేజ్‌లో 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాల్గవ అంతస్తులో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను రూ.74 కోట్లకు విక్రయించినట్టు నివేదికలు వెల్లడించాయి.
హడ్సన్ నది వ్యూతో ఉన్నఅత్యంత పురాతన, మంచి కళాకృతితో చెక్కతో నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్‌ను అంబానీ విక్రయించారు. ఈ భారీ భవనాన్ని 1919లో నిర్మించారు. 17 అంతస్తులు ఉన్న ఈ భవనంలో నాలుగో అంతస్థులో అంబానీ ఫ్లాట్ ఉన్నది. ఈ భవనాన్ని 2009లో ఆధునీకరించారు. దృఢమైన వాస్తుశిల్పులు, అందమైన ఇంటీరియర్స్‌తో భవనం ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram