Chhattishgarh | ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దుశ్చర్య.. ఐఈడీ పేలడంతో జవాను మృతి
Chhattishgarh | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా( Bijapur Dist )లో నక్సల్స్( Naxals ) దుశ్చర్యకు పాల్పడ్డారు. కూంబింగ్ కొనసాగిస్తున్న ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ జవాన్ల( CAF Jawans )ను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ దాడులకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని టేమినార్, ఈటేపాల్ మధ్య ఐఈడీ( IED )ని పేలడంతో అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ విజయ్ యాదవ్(58) ప్రాణాలు కోల్పోయారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మిర్తూరు పోలీసు స్టేషన్ పరిధిలోని అడవుల్లో నక్సల్స్ సంచరిస్తున్నట్లు భద్రతా […]

Chhattishgarh | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా( Bijapur Dist )లో నక్సల్స్( Naxals ) దుశ్చర్యకు పాల్పడ్డారు. కూంబింగ్ కొనసాగిస్తున్న ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ జవాన్ల( CAF Jawans )ను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ దాడులకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని టేమినార్, ఈటేపాల్ మధ్య ఐఈడీ( IED )ని పేలడంతో అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ విజయ్ యాదవ్(58) ప్రాణాలు కోల్పోయారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
మిర్తూరు పోలీసు స్టేషన్ పరిధిలోని అడవుల్లో నక్సల్స్ సంచరిస్తున్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో టేమినార్ – ఈటేపాల్ మధ్య ఉన్న అడవుల్లో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, ఐఈడీపై విజయ్ యాదవ్ కాలు పెట్టాడు. దీంతో క్షణాల్లోనే ఆ ఐఈడీ పేలి.. యాదవ్ ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం ఉదయం నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు సంభవించిన సంగతి తెలిసిందే. అడవి దట్టంగా ఉండటంతో పోలీసుల కళ్లుగప్పి నక్సల్స్ పరారీ అయ్యారు. అయితే నక్సల్ ఉన్న ఏరియాలో రెండు ఐఈడీలను బలగాలను నిర్వీర్యం చేశాయి.