OU మానేరు హాస్టల్ వద్ద దారుణం.. యువతిపై కత్తితో దాడి
విధాత: ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ వద్ద ఘోరం జరిగింది. ఓ యువతిపై యువకుడు పదునైన కత్తితో దాడి చేసి పారిపోయాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థులు, బాధితురాలిని కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ముషీరాబాద్ బోలక్‌పూర్ బస్తీకి చెందిన ఓ యువతి(18) మెడికల్ షాపులో పని చేస్తోంది. అదే బస్తీకి చెందిన రంజిత్(18) అనే యువకుడు ఆమెను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు, అతని ప్రేమను ఆమె తిరస్కరిస్తూ వస్తోంది. అయితే మాట్లాడుకుందామని […]

విధాత: ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ వద్ద ఘోరం జరిగింది. ఓ యువతిపై యువకుడు పదునైన కత్తితో దాడి చేసి పారిపోయాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థులు, బాధితురాలిని కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. ముషీరాబాద్ బోలక్‌పూర్ బస్తీకి చెందిన ఓ యువతి(18) మెడికల్ షాపులో పని చేస్తోంది. అదే బస్తీకి చెందిన రంజిత్(18) అనే యువకుడు ఆమెను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు, అతని ప్రేమను ఆమె తిరస్కరిస్తూ వస్తోంది. అయితే మాట్లాడుకుందామని చెప్పి శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఓయూలోని మానేరు హాస్టల్ వద్దకు తీసుకొచ్చాడు.
అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో రంజిత్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. యువతి గట్టిగా అరవడంతో రంజిత్ పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు, పోలీసులు కలిసి కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఓయూ పోలీసులు.. నిందితుడు రంజిత్ కోసం గాలిస్తున్నారు.