విధాత బ్యూరో, కరీంనగర్: వికారాబాద్, హనుమకొండ జిల్లాలలో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి అంటూ బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించారు.
ఈ మేరకు ఆయనపై కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సుమోటో కింద కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్151 క్రైమ్ నెంబర్ 147/2023 ప్రకారం ఆయనపై మంగళవారం మధ్యాహ్నం కేసు నమోదు చేసినట్లు రెండవ పట్టణ సిఐ లక్ష్మీ బాబు తెలిపారు.
విద్యార్థులను గందరగోళ పరిచేందుకు మీడియాలోను, సోషల్ మీడియాలోనూ ఆయన పోస్టులు చేశారని పోలీసులు పేర్కొన్నారు. తన అనుచరుల ద్వారా పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళనలు చేయించే ప్రయత్నం చేశారని వారు చెప్పారు.