Bandi Sanjay | తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి.. బండి సంజయ్‌ రాజీనామా..!

Bandi Sanjay విధాత: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్‌ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దల ఆదేశాల మేరకు ఢిల్లీలోనే ఉన్న బండి సంజయ్‌ వెంటనే తన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు అందించారు. అయితే బండి సంజయ్‌ని కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే […]

  • By: Somu |    latest |    Published on : Jul 04, 2023 9:51 AM IST
Bandi Sanjay | తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి.. బండి సంజయ్‌ రాజీనామా..!

Bandi Sanjay

విధాత: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్‌ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి విధితమే.

ఈ క్రమంలోనే బీజేపీ పెద్దల ఆదేశాల మేరకు ఢిల్లీలోనే ఉన్న బండి సంజయ్‌ వెంటనే తన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు అందించారు.

అయితే బండి సంజయ్‌ని కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది