Bandla Ganesh | తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన బండ్ల గ‌ణేష్‌.. ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

Bandla Ganesh: క‌మెడీయ‌న్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత నిర్మాత‌గా స‌త్తా చాటిన బండ్ల రాజకీయాల‌లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. అయితే అక్క‌డ పెద్ద‌గా స‌క్సెస్ రావడంతో తిరిగి సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నారు. ఆ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేస్తాన‌ని చెప్పిన బండ్ల సైలెంట్‌గా ఉండిపోయాడు. సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడు సంద‌డి చేస్తూనే ఉంటాడు. సినిమాలు, రాజ‌కీయాలు ఇలా ఏదో ఒక‌వ విష‌యంపై త‌నదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. అయితే ఎంతో యాక్టివ్‌గా […]

  • By: sn    latest    Jul 13, 2023 8:39 AM IST
Bandla Ganesh | తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన బండ్ల గ‌ణేష్‌.. ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

Bandla Ganesh: క‌మెడీయ‌న్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత నిర్మాత‌గా స‌త్తా చాటిన బండ్ల రాజకీయాల‌లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. అయితే అక్క‌డ పెద్ద‌గా స‌క్సెస్ రావడంతో తిరిగి సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నారు. ఆ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేస్తాన‌ని చెప్పిన బండ్ల సైలెంట్‌గా ఉండిపోయాడు. సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడు సంద‌డి చేస్తూనే ఉంటాడు. సినిమాలు, రాజ‌కీయాలు ఇలా ఏదో ఒక‌వ విష‌యంపై త‌నదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. అయితే ఎంతో యాక్టివ్‌గా ఉండే బండ్ల గ‌ణేష్ స‌డెన్‌గా ఆసుప‌త్రిలో అడ్మిట్ కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

బండ్ల గణేష్ ఓ ఆసుపత్రిలో బెడ్ పై, సెలైన్ పెట్టుకున్న‌ ఫోటో ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇది చూసిన ఆయ‌న ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. మా అన్న‌కి ఏమైంది అంటూ ఎంక్వైరీలు చేస్తున్నారు.అయితే బండ్ల గ‌ణేష్‌కి వైర‌ల్ ఫీవ‌ర్ సోక‌డంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. కాని స్వయంగా బండ్ల గణేష్ క్లారిటీ ఇస్తే కాని… అసలు ఏం జరిగిందో తెలియదు. కాగా, గ‌తంలో బండ్ల గ‌ణేష్ కరోనాతో ఆసుప‌త్రిలో చేరి చావు వ‌ర‌కు వెళ్లి వ‌చ్చాడు. ఆయ‌న‌కి అద్భుత‌మైన ట్రీట్‌మెంట్ అందించ‌డంతో క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు.

బండ్ల గ‌ణేష్ అంటే ప‌వ‌న్ భ‌క్తుడిగా ఆయ‌న‌కు మంచి పేరు ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎదురుగా ఉంటే బండ్ల గ‌ణేష్ నోటి ప్ర‌వాహం ఆగ‌దు. ఆయ‌న గురించి మాట్లాడుతూనే ఉంటారు. అయిత కొద్ది రోజులుగా ఇద్ద‌రి మ‌ధ్య కాస్త దూరం పెరిగిన‌ట్టు తెలుస్తుంది. త్రివిక్ర‌మ్ వ‌ల్ల‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కి దూర‌మ‌య్యాడని ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారు బండ్ల గ‌ణేష్‌. గురూజీ అంటూ త్రివిక్ర‌మ్‌ని బాగానే ట్రోల్ చేశాడు. ఇక ఆయ‌న ములుగు ఎమ్మెల్యే సీతక్క బయోపిక్ తీస్తానని అన్నారు. ఓ ట్విట్టర్ యూజర్ ఇచ్చిన సూచనను ఆయన స్వీకరిస్తూ… సీతక్క బయోపిక్ తీయడంపై ఆలోచిస్తానని చెప్పారు.