Bathini Harinath goud | బత్తిని హరినాథ్ గౌడ్ అస్తమయం

Bathini Harinath goud | విధాత‌: వంశారంపర్యంగా ఎన్నో తరాలనుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆస్థమా, ఉబ్బసం, దగ్గు, దమ్ము, లాంటి అనేక దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధుల తో బాధపడే రోగులకు ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తి రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం (Fish prasadam) పంపిణీ ద్వారా నయం చేస్తూ ఎనలేని కీర్తి గడించిన బత్తిన హరినాథ్ గౌడ్(84) (Bathini Harinath goud) […]

Bathini Harinath goud | బత్తిని హరినాథ్ గౌడ్ అస్తమయం

Bathini Harinath goud | విధాత‌: వంశారంపర్యంగా ఎన్నో తరాలనుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆస్థమా, ఉబ్బసం, దగ్గు, దమ్ము, లాంటి అనేక దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధుల తో బాధపడే రోగులకు ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తి రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం (Fish prasadam) పంపిణీ ద్వారా నయం చేస్తూ ఎనలేని కీర్తి గడించిన బత్తిన హరినాథ్ గౌడ్(84) (Bathini Harinath goud) నిన్నరాత్రి 7.30 గంటల సమయంలో కవాడి గూడ లో ఉన్న స్వగృహంలో కన్నుమూశారు.

ముప్పై సంవత్సరాలు గా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న హరినాథ్ కు రెండు సంవత్సరాల క్రితం ఓ కాలు తీసివేశారు. అప్పటినుంచి ఆర్టిఫీషియల్ కాలు తో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా మంచానికే పరిమితంమైన ఆయనకు ద్రవహారం తోనే వైద్య సేవలు జరుగుతున్నాయను కొడుకు అమర్నాథ్ గౌడ్ తెలియ చేశారు.. ఆయన కు భార్య సుమిత్రా దేవి,ఇద్దరు కుమారులు అనిల్ (ప్రస్తుతం ఆస్ట్రేలియా) ఉన్నట్లు సమాచారం) రెండవ కుమారుడు అమర్నాథ్ గౌడ్ కవాడీగూడాలో తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు.

ఇద్దరు కుమార్తెలు అలకనంద (అమెరికాలో ఉన్నారు) అర్చనా హైద్రాబాద్ లోనే ఉంటున్నారు.. విదేశాల్లో ఉన్న అక్క ,అన్న ఈరాత్రికి వస్తారని, రేపు ఉదయం 10 గం లకు బన్సీలాల్ పేట హిందూ స్మశాన వాటిక లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని హరినాథ్ కొడుకు అమర్నాథ్ గౌడ్ మరియు అన్న కొడుకు బత్తిన గౌరీ శంకర గౌడ్ తెలిపారు.

తరాలు మారినా దాదాపు ఏడు దశాబ్దాలుగా బత్తిన హరినాథ్ గౌడ్ నేతృత్వంలోనే చేప ప్రసాదం పంపిణీ జరుగుతూ ఉండేది .కుటుంబ సభ్యులందరినీ కలుపుకు పోతూ ఎన్ని ప్రభుత్వాలు మారినినా , అమాత్యులతో అధికారులతో సామాజిక సేవా సంఘాల తో ఎంతో గౌరవ ప్రదమైన సత్ సంబంధాలు కొనసాగిస్తూ , ఎన్ని విమర్శలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొంటూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో లక్షలాది మంది కి చేప ప్రసాదం పంపిణీ చేసేవారు.

ముఖ్యంగా జాతీయ , రాష్ట్రీయ మీడియా రంగం లో పనిచేసే ప్రతి ఒక్కరితో చివరి వరకూ ఎంతో ఆత్మీయ సంబంధాలు కొనసాగించారు. హరినాథ్ గౌడ్ ఇద్దరు అన్నలు చనిపోగా తమ్ముడు విశ్వనాథ గౌడ్ అన్నదమ్ముల కొడుకులు మనవులు మనవరాళ్లు ఉన్నారు.. బత్తిన హరినాథ్ గౌడ్ మరణం వారి కుటుంబానికే కాక లక్షలాది మంది ఆస్థమా రోగులకు తీరని మనో వేదన. తెలంగాణ బిడ్డగా ఆయన చేసిన నిస్వార్థ అకుంటిత సేవలు భారతదేశ చరిత్ర లోనే లిఖించే ఆస్థమాద్యాయం.