Viral Video | ఒక‌టే ఇల్లు.. బెడ్రూం భార‌త్‌లో.. కిచెన్ మ‌య‌న్మార్‌లో

Viral Video | ఇల్లు ఒక‌టే అంటున్నారు. కానీ బెడ్రూం భార‌త్‌లో.. కిచెన్ మ‌య‌న్మార్‌లో ఏంట‌ని సందేహా ప‌డుతున్నారా? మీ సందేహం నిజ‌మే. ఆ ఇల్లు దేశ స‌రిహ‌ద్దుల్లో ఉంది. బెడ్రూం భార‌త్ స‌రిహ‌ద్దులో ఉంటే.. కిచెన్ ఏమో మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో ఉంది. కిచెన్ నుంచి బెడ్రూం లోకి వెళ్లాలంటే దేశ స‌రిహ‌ద్దులు దాటాల్సిందే. మ‌రి ఆ ఇంటి గురించి తెలుసుకోవాలంటే.. నాగాలాండ్ రాష్ట్రానికి వెళ్ల‌క త‌ప్ప‌దు. నాగాలాండ్ రాజ‌ధాని కొహిమాకు 380 కిలోమీట‌ర్ల దూరంలో లాంగ్వా […]

  • By: krs    latest    Jan 15, 2023 4:19 PM IST
Viral Video | ఒక‌టే ఇల్లు.. బెడ్రూం భార‌త్‌లో.. కిచెన్ మ‌య‌న్మార్‌లో

Viral Video | ఇల్లు ఒక‌టే అంటున్నారు. కానీ బెడ్రూం భార‌త్‌లో.. కిచెన్ మ‌య‌న్మార్‌లో ఏంట‌ని సందేహా ప‌డుతున్నారా? మీ సందేహం నిజ‌మే. ఆ ఇల్లు దేశ స‌రిహ‌ద్దుల్లో ఉంది. బెడ్రూం భార‌త్ స‌రిహ‌ద్దులో ఉంటే.. కిచెన్ ఏమో మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో ఉంది. కిచెన్ నుంచి బెడ్రూం లోకి వెళ్లాలంటే దేశ స‌రిహ‌ద్దులు దాటాల్సిందే. మ‌రి ఆ ఇంటి గురించి తెలుసుకోవాలంటే.. నాగాలాండ్ రాష్ట్రానికి వెళ్ల‌క త‌ప్ప‌దు.

నాగాలాండ్ రాజ‌ధాని కొహిమాకు 380 కిలోమీట‌ర్ల దూరంలో లాంగ్వా అనే గ్రామం ఉంది. ఈ గ్రామం మోన్ జిల్లాలో ఉంది. లాంగ్వా గ్రామం భార‌త్ – మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దుల్లో ఉంది. ఈ గ్రామంలో అధికంగా కొన్యాక్ తెగకు చెందివారే ఉంటారు. అయితే ఈ తెగ‌కు అధిప‌తిగా ఆంగ్ అనే వ్య‌క్తి వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. ఆంగ్ ఇల్లే రెండు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య‌లో ఉంది. ఈయ‌న ఇంటిని మ‌య‌న్మార్ – ఇండియా స‌రిహ‌ద్దులు వేరు చేస్తున్నాయి. ఆంగ్ ఇంట్లోని బెడ్రూం భార‌త్ స‌రిహ‌ద్దులో ఉంటే, కిచెన్ మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో ఉంది.

ఇక ఆంగ్ ఇంటికి సంబంధించిన వీడియోను నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా ఆలోంగ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు. మ‌య‌న్మార్‌లో తింటారు.. భార‌త్‌లో ప‌డుకుంటార‌ని జోకులు పేలుస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి ఆ ఇంటిపై..!