Bellaiah Naik | రాష్ట్రపతిని అవమానించిన BJP, RSS: బెల్లయ్య నాయక్

Bellaiah Naik దేశ ద్రోహి సావర్కర్ పుట్టిన రోజున పార్లమెంటు ప్రారంభోత్సవమా? ఈనెల27, 28 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేత ప్రారంభోత్సవం చేయించాలి టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ విధాత: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవానికి దేశ ప్రథ‌మ పౌరురాలు ద్రౌపది ముర్మును పిలవకుండా బీజేపీ, RSS అవమానిస్తున్నార‌ని టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఒక […]

Bellaiah Naik  | రాష్ట్రపతిని అవమానించిన BJP, RSS: బెల్లయ్య నాయక్

Bellaiah Naik

  • దేశ ద్రోహి సావర్కర్ పుట్టిన రోజున పార్లమెంటు ప్రారంభోత్సవమా?
  • ఈనెల27, 28 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
  • రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేత ప్రారంభోత్సవం చేయించాలి
  • టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్

విధాత: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవానికి దేశ ప్రథ‌మ పౌరురాలు ద్రౌపది ముర్మును పిలవకుండా బీజేపీ, RSS అవమానిస్తున్నార‌ని టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఒక దేశద్రోహి సావర్కర్ పుట్టిన రోజు నాడు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడాన్ని ఆక్షేపించారు.

నెహ్రూ చనిపోయిన రోజు కావాలనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారన్నారు. ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలువకుండా దేశంలోని మహిళలని, యావత్ గిరిజనుల్ని అవమానించారన్నారు. రాష్ట్రపతిని అవమానించడానికి నిరసనగా 25 వ తేదిన జిల్లా కేంద్రాల్లో, 26 వ తేదిన మండల కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

27 వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 28వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేస్తామన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ద్రౌపది ముర్ముతోనే ప్రారంభోత్సవం చేయించాలన్నారు.