Rahul Gandhi | బైక్ మెకానిక్‌గా రాహుల్ గాంధీ.. ఫోటోలు వైర‌ల్

Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర స్ఫూర్తిని కొన‌సాగిస్తున్నారు. క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు చేప‌ట్టిన ఈ యాత్ర‌లో రాహుల్ గాంధీ.. ఎంతో మంది సామాన్యుల‌కు చేరువ‌య్యారు. వారి జీవితాల గురించి పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేశారు. భార‌త్ జోడో యాత్ర ముగిసిన‌ప్ప‌టికీ.. సామాన్యుల జీవితాల‌ను తెలుసుకునేందుకు మ‌రింత ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగానే ఇటీవ‌లే ట్ర‌క్కు డ్రైవ‌ర్ల జీవితాల‌ను తెలుసుకునేందుకు వారితో ప్ర‌యాణించిన […]

Rahul Gandhi | బైక్ మెకానిక్‌గా రాహుల్ గాంధీ.. ఫోటోలు వైర‌ల్

Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర స్ఫూర్తిని కొన‌సాగిస్తున్నారు. క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు చేప‌ట్టిన ఈ యాత్ర‌లో రాహుల్ గాంధీ.. ఎంతో మంది సామాన్యుల‌కు చేరువ‌య్యారు. వారి జీవితాల గురించి పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేశారు.

భార‌త్ జోడో యాత్ర ముగిసిన‌ప్ప‌టికీ.. సామాన్యుల జీవితాల‌ను తెలుసుకునేందుకు మ‌రింత ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగానే ఇటీవ‌లే ట్ర‌క్కు డ్రైవ‌ర్ల జీవితాల‌ను తెలుసుకునేందుకు వారితో ప్ర‌యాణించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బైక్ మెకానిక్‌ల‌ను క‌లిశారు. వారి షాపుల వ‌ద్ద‌కు వెళ్లి వారి జీవిత విశేషాల‌ను తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. మంగ‌ళ‌వారం ఢిల్లీలోని క‌రోల్ బాగ్‌లో ప‌ర్య‌టించారు. అక్క‌డున్న బైక్ మెకానిక్ షాపుల య‌జ‌మానులు, వ‌ర్క‌ర్ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. వారితో మాట్లాడుతూ.. రాహుల్ కూడా ఆ ప‌నుల్లో భాగ‌స్వాముల‌య్యారు. స్క్రూ డ్రైవ‌ర్ చేత‌బూని మెకానిక్ చేశారు రాహుల్. ఈ షాపుల‌కు కొద్ది దూరంలో ఉన్న సైకిల్ మార్కెట్‌కు కూడా రాహుల్ వెళ్లారు. రాహుల్‌ను చూసేందుకు భారీ సంఖ్య‌లో జ‌నాలు త‌ర‌లివ‌చ్చారు. అంద‌రితో రాహుల్ క‌ర‌చాల‌నం చేస్తూ, ఆప్యాయంగా ప‌లుక‌రించారు. రాహుల్ గాంధీ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌డం ఇదేం కొత్త‌కాదు. రంజామ్ స‌మ‌యంలోనూ మ‌తియా మ‌హాల్ మార్కెట్‌లో ప‌ర్య‌టించారు.