Rahul Gandhi | రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ.. మోదీ ప్రత్యామ్నాయం ఆయనే..!
Rahul Gandhi | దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. ఆ పార్టీకి పూర్వవైభవం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీకి ఆదరణ పెరిగింది. 2024 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీకి రాహుల్ గాంధే ప్రత్యామ్నాయం అవుతారని ప్రజలు భావిస్తున్నారు. ఎన్డీటీవీ, లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. 19 రాష్ట్రాలకు చెందిన 7 వేల మంది ఈ సర్వేలో […]
Rahul Gandhi |
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. ఆ పార్టీకి పూర్వవైభవం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీకి ఆదరణ పెరిగింది.
2024 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీకి రాహుల్ గాంధే ప్రత్యామ్నాయం అవుతారని ప్రజలు భావిస్తున్నారు. ఎన్డీటీవీ, లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. 19 రాష్ట్రాలకు చెందిన 7 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీని 26 శాతం మంది ఇష్టపడుతున్నట్లు తేలింది. ఆయన భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర చేపట్టిన తర్వాత రాహుల్‌కు 15 శాతం ఆదరణ పెరిగింది.
అయితే రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో మోదీని రాహుల్ గాంధీ ఢీకొట్టే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. మోదీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీనే అని 34 శాతం మంది ప్రజలు సర్వేలో ఓటేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 11 శాతం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 4 శాతం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు 5 శాతం మంది ఓట్లు వేశారు.
ఎన్డీటీవీ, లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ చేపట్టిన సర్వే 19 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లోని 7,202 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సర్వేను మే 10 నుంచి 19వ తేదీ మధ్యలో నిర్వహించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram