Bharat Jodo Yatra 2 | రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’.. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు
Bharat Jodo Yatra 2 ధృవీకరించిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తన రెండో విడత భారత్ జోడో యాత్రను గుజరాత్ నుంచి మేఘాల వరకు నిర్వహించనున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ధ్రువీకరించారు. దానికి సమాంతరంగా మహారాష్ట్రలో పార్టీ సీనియర్ నేతలు యాత్రలు చేపడతారని తెలిపారు. తొలి దశ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలైన […]
Bharat Jodo Yatra 2
- ధృవీకరించిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తన రెండో విడత భారత్ జోడో యాత్రను గుజరాత్ నుంచి మేఘాల వరకు నిర్వహించనున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ధ్రువీకరించారు. దానికి సమాంతరంగా మహారాష్ట్రలో పార్టీ సీనియర్ నేతలు యాత్రలు చేపడతారని తెలిపారు.
తొలి దశ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలైన యాత్ర.. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 3970 కిలోమీటర్లు సాగింది.
మొత్తంగా 130రోజులపాటు సాగి.. ఈ ఏడాది జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. తాజాగా రెండో దశ భారత్ జోడో యాత్రను నాయకులు ధృవీకరించినా.. ఎప్పుటి నుంచి ప్రారంభం అవుతుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram