Bhuvneshwar kumar | క్రికెట్ ప్రేమికులకి పెద్ద షాక్.. భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్..!
Bhuvneshwar kumar: ప్రస్తుతం భారత జట్టులో కీలక మార్పలు చోటు చేసుకుంటున్నాయి. యువ క్రికెటర్స్‌కి ఎక్కువ అవకాశాలు ఇచ్చి సీనియర్స్‌ని పక్కన పెడుతున్న నేపథ్యంలో కొందరు రిటైర్మెంట్ బాట పడుతున్నారు. తాజాగా సీనియర్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా భువీకి అవకాశాలు ఎక్కువ రాకపోవడం, వచ్చిన అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకోలేక విమర్శల బారిన పడుతుండడం వల్లనే భువనేశ్వర్ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు జోరుగా ప్రచారం […]
Bhuvneshwar kumar: ప్రస్తుతం భారత జట్టులో కీలక మార్పలు చోటు చేసుకుంటున్నాయి. యువ క్రికెటర్స్‌కి ఎక్కువ అవకాశాలు ఇచ్చి సీనియర్స్‌ని పక్కన పెడుతున్న నేపథ్యంలో కొందరు రిటైర్మెంట్ బాట పడుతున్నారు. తాజాగా సీనియర్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా భువీకి అవకాశాలు ఎక్కువ రాకపోవడం, వచ్చిన అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకోలేక విమర్శల బారిన పడుతుండడం వల్లనే భువనేశ్వర్ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే భువనేశ్వర్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనకి పలు సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు నెటిజన్స్.ఇంతకముందు భువనేశ్వర్ కుమార్ ఇన్‌స్టా బయోలో ‘ఇండియన్ క్రికెటర్’ అని ఉండేది. కానీ ఇటీవల క్రికెటర్ అనే పదాన్ని తొలగించి అందులో.. ‘ఇండియన్, ఫ్యామిలీ ఫస్ట్, పెట్ లవర్, కాజువల్ గేమర్’ అనే పదాలు చేర్చారు. దీంతో అందరిలో అనుమానాలు రెట్టింపు అయ్యాయి. త్వరలోనే భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్ ప్రకటన రానుందని చెబుతున్నారు. చూడాలి మరి ఈ వార్తలపై భువీ ఏమైన స్పందిస్తాడా అన్నది.
ఇక భువనేశ్వర్ కుమార్ 2022 జనవరిలో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. పార్ల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీన ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఇక అప్పటి నుంచి వరుస గాయాలు, పేలవ ఫామ్ కారణంగా అతడు క్రమంగా వన్డే జట్టుకు దూరమయ్యాడు.నవంబర్ 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపికైన భువనేశ్వర్… నాలుగు మ్యాచ్‌లు ఆడిన భువీ కేవలం 3 వికెట్లు పడగొట్టాడు. ఇక నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌తో చివరి టీ20 మ్యాచ్ ఆడగా… ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ వికెట్ తీయలేకపోయాడు. అయితే ఐర్లాండ్‌తో సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సమాచారం. ఇక భువనేశ్వర్ బాటలో రవిచంద్రన్ అశ్విన్ కూడా పయనించనునన్నాడని అంటున్నారు. పరిమిత ఓవర్లకి త్వరలోనే ఆయన స్వస్తి పలకనున్నాడని సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram