వరంగల్‌లో బీఆరెస్‌కు బిగ్‌ షాక్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీఆరెస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. వరంగల్‌ బీఆరెస్‌ సిటింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు

  • By: Somu    latest    Mar 15, 2024 11:57 AM IST
వరంగల్‌లో బీఆరెస్‌కు బిగ్‌ షాక్‌
  • ఎంపీ పసునూరి కాంగ్రెస్‌లోకి
  • మాజీ ఎమ్మెల్యే ఆరూరి బీజేపీలోకి


విధాత : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీఆరెస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. వరంగల్‌ బీఆరెస్‌ సిటింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వరంగల్‌ పార్లమెంటు సీటు విషయమై బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మాదిగలకు అన్యాయం చేశారని తీవ్ర అసంతృప్తితో ఉన్న పసునూరి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.


అటు వర్ధన్నపేట బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో భేటీకి వెళ్లారు. అరూరికి బీజేపీ వరంగల్‌ టికెట్‌ ఇచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం అంగీకారం తెలపడంతో ఆయన బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇదే వరంగల్‌కు చెందిన బీఆరెస్‌ మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ బీజేపీలో చేరారు. వరుసగా సాగుతున్న వలసలతో బీఆరెస్‌ జిల్లాలో రాజకీయంగా పలుచన బడుతుండటం కేడర్‌ను ఆందోళనకు గురి చేస్తుంది.