కంటెస్టెంట్స్‌ని తెగ ఏడిపించిన బిగ్ బాస్..చీరకొంగుతో యావర్‌కి శుభశ్రీ పాఠాలు

బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే హౌజ్ నుండి నలుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లగా, ఇప్పుడు మరో ఐదుగురు ప్రవేశించబోతున్నారని తెలుస్తుంది. అయితే తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి సరదా టాస్క్ ఇచ్చారు. హౌజ్‌లో కొందరు హిందీ, ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతుండడంతో తెలుగు నేర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు.
శోభా శెట్టి, శుభ శ్రీ కొంచెం తెలుగులో మాట్లాడడం అలవాటైన యావర్‌కి ఇంకా రాలేదు. దాంతో ప్రతి ఒక్కరు తెలుగు టీచర్లుగా మారి ప్రిన్స్ యావర్‌కు ఐదు తెలుగు పదాలను నేర్పించాలని బిగ్ బాస్ తెలియజేశారు.అయితే యావర్ తెలుగులో కాకుండా ఇతర భాషలో మాట్లాడితే ఆయన పార్ట్నర్ అయిన తేజ ఐదు సిటప్స్ తీయాలని రూల్ పెడతాడు బిగ్ బాస్.
ఈ టాస్క్ చాలా సరదాగా సాగింది. పంతులమ్మగా వచ్చిన శుభ శ్రీ మాత్రం యావర్ కి ప్రేమ పాటలు నేర్పించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ యావర్ ని తెలుగు చెప్పమని చెబుతూ, తన కొంగుని యావర్ కి ఇచ్చి శుభశ్రీ చిలిపిగా ప్రవర్తించింది. యావర్ కూడా తనలోని పులిహోర రాజాని మరోసారి చూపించాడు.
అనంతరం బడ్డీస్ దగ్గర ఉన్న స్టార్స్‌ను లెక్కించమని సుబ్బుకి చెప్పగా ఆమె రెండు స్టార్స్ ఉన్నాయని చెబుతుంది. దాంతో ప్రియాంక, శోభ కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటిస్తారు. అనంతరం ‘చిట్టీ ఆయీ రే’ అనే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి నుంచి వచ్చిన లెటర్స్‌ను బడ్డీస్‌లో ఉన్న ఒకరు చదవాలని.. మరొకరు వారి లెటర్‌ను చదవకుండా త్యాగం చేయాలని బిగ్ బాస్ చెబుతాడు.
చాలా రోజుల తర్వాత వచ్చిన లెటర్స్‌ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. కాని కొద్ది సేపు డిస్కషన్ పెడతారు. టాస్క్‌లో భాగంగా.. యాక్టివిటీ రూమ్‌కు మొదటగా వెళ్లిన గౌతమ్..సుబ్బుల మధ్య చాలా డ్రామా నడిచిన తర్వాత.. సుబ్బు లెటర్‌ను త్యాగం చేస్తుంది.
ఈ క్రమంలో గౌతమ్ కెప్టెన్సీ కంటెండర్‌గా ముందుకు సాగుతాడు.ఇక ప్రిన్స్ యావర్, తేజ లలో.. చాలా డ్రామా నడిచిన తర్వాత తేజ తనకొచ్చిన లెటర్ చదివి కెప్టెన్సీ టాస్క్‌లో ముందుకు వెళతాడు. ఇక మిగతా బడ్డీస్‌లో ఎవరు త్యాగం చేస్తారనేది తదుపరి ఎపిసోడ్‌లో తెలియనుంది.