BiggBossTelugu7 | బిగ్‌బాస్ వస్తున్నాడు..! ప్రోమో విడుదల..! అభిమానులకు ఇక పండగే..! హోస్ట్‌గా స్టార్ హీరో..!
BiggBossTelugu7 | ఎట్టకేలకు బిగ్‌బాస్ తెలుగు మరోసారి బుల్లితెర అభిమానులను అలరించనున్నది. ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు రియాలరిటీ షో.. త్వరలో ఏడో సీజన్ ప్రసారం కానున్నది. వాస్తవానికి ఎప్పుడో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆలస్యమైంది. దాంతో ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ బిగ్‌బాస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘బిగ్‌బాస్7 తెలుగు […]

BiggBossTelugu7 | ఎట్టకేలకు బిగ్‌బాస్ తెలుగు మరోసారి బుల్లితెర అభిమానులను అలరించనున్నది. ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు రియాలరిటీ షో.. త్వరలో ఏడో సీజన్ ప్రసారం కానున్నది.
వాస్తవానికి ఎప్పుడో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆలస్యమైంది. దాంతో ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ బిగ్‌బాస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘బిగ్‌బాస్7 తెలుగు మిమ్మల్ని ఎమోషన్స్, సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో కూడిన రోలర్‌కోస్టర్ రైడ్‌లో తీసుకెళ్తుంది. మరింతగా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని అడుగడుగునా అలరిస్తామని హామీ ఇస్తున్నాం’ అంటూ స్టార్ మా గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా బిగ్‌బాస్ గ్లింప్స్ విడుదల చేయడంతో అభిమానులు సర్‌ప్రైజ్ అయ్యారు. అయితే, ఈ సారి హోస్ట్ ఎవరన్నదానిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతున్నది. ఏడో సీజన్‌కు నాగార్జున హోస్ట్ చేయరని ప్రచారం జరుగుతున్నది.
ఓ స్టార్ హీరోను హోస్ట్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో బీబీ హౌస్‌లోకి స్టార్ సెలబ్రెటీలను తీసుకురానున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ఈ సారి కొత్తగా షోను అభిమానుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గత సీజన్‌లో పూర్తిగా బిగ్‌బాస్ ఏమాత్రం అభిమానులను అలరించలేకపోయింది. తాజాగా సెలబ్రెటీలను తీసుకురానున్నట్లు తెలుస్తున్నది. హౌస్‌లోకి వచ్చేదెవరు..? షోను హోస్ట్ చేసేదెవరో వేచి చూడాల్సిందే..!
View this post on Instagram