Bizarre | లంచ్ మాంసాహారం తీసుకురాకుంటేనే ఉద్యోగం.. ఓ సంస్థ నిబంధ‌న‌

Bizarre | విధాత‌: సాధార‌ణ ఇంట‌ర్న్‌షిప్ (Internship) ఉద్యోగం (Employment) వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రి మీదా అంతులేని ఒత్తిడి (Pressure) ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. సంస్థ యాజ‌మానుల మెప్పు పొంద‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగులు త‌మ నైపుణ్యానికి ప‌దును పెట్టుకుంటూ ప‌నిచేయాల్సి ఉంటుంది. లేక‌పోతే ఉద్యోగానికే ముప్పు వాటిల్లొచ్చు.అయితే ఉద్యోగుల‌పై యాజ‌మాన్యాల కోరిక‌లు మాత్రం హ‌ద్దులు దాటుతున్నాయ‌ని మ‌రో ఉదంతం రుజువు చేసింది. తాజాగా ఉద్యోగం కోసం ఓ సంస్థ‌కు అప్లై చేసిన ఉద్యోగికి వింత అనుభ‌వం (Bizarre […]

Bizarre | లంచ్ మాంసాహారం తీసుకురాకుంటేనే ఉద్యోగం.. ఓ సంస్థ నిబంధ‌న‌

Bizarre |

విధాత‌: సాధార‌ణ ఇంట‌ర్న్‌షిప్ (Internship) ఉద్యోగం (Employment) వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రి మీదా అంతులేని ఒత్తిడి (Pressure) ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. సంస్థ యాజ‌మానుల మెప్పు పొంద‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగులు త‌మ నైపుణ్యానికి ప‌దును పెట్టుకుంటూ ప‌నిచేయాల్సి ఉంటుంది. లేక‌పోతే ఉద్యోగానికే ముప్పు వాటిల్లొచ్చు.అయితే ఉద్యోగుల‌పై యాజ‌మాన్యాల కోరిక‌లు మాత్రం హ‌ద్దులు దాటుతున్నాయ‌ని మ‌రో ఉదంతం రుజువు చేసింది.

తాజాగా ఉద్యోగం కోసం ఓ సంస్థ‌కు అప్లై చేసిన ఉద్యోగికి వింత అనుభ‌వం (Bizarre Experience) ఎదురైంది. ఈ ఉద్యోగానికి మిమ్మ‌ల్ని త‌గిన వారిగా భావించి త‌ర్వాతి ప్ర‌క్రియ‌కు షార్ట్ లిస్ట్ చేశామ‌ని స‌ద‌రు సంస్థ నుంచి మెయిల్ (Mail)వ‌చ్చింది.

సదరు అభ్య‌ర్థి ఎగిరి గంతేసే లోపే మ‌రో పేరా చ‌దివి ఆశ్చ‌ర్య‌పోయాడు. త‌ర్వాతి ద‌శ‌కి వెళ్లేముందు ఒక అంశంపై మీ హామీ అవ‌స‌రమంటూ… ఉద్యోగానికి వ‌చ్చేట‌ప్పుడు లంచ్ బాక్స్‌లో వెజ్ మాత్ర‌మే (Veg Food) తెచ్చుకోవాల‌ని సంస్థ‌ పేర్కొంది.

ఈ విష‌యంలో తాము క‌ఠినంగా ఉంటామ‌నీ సెల‌విచ్చింది. కంపెనీ బ‌య‌ట ఎలా ఉన్నా.. ఇక్క‌డ ఈ నిబంధ‌న పాటించాల్సిందేన‌నీ ప్ర‌స్తావించింది. దీనిని స్క్రీన్ షాట్ తీసిన యూజ‌ర్.. ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మ వేదిక రెడిట్‌ (Reddit)లో పోస్ట్ చేశాడు. దీనిపై ప‌లువురు యూజ‌ర్లు పలు ర‌కాలుగా స్పందించారు.

ఈ ప్ర‌క‌ట‌న కోకాకోలా కంపెనీ నిబంధ‌న‌ను గుర్తుకు తెస్తోంది. ఒకానొక స‌మ‌యంలో త‌మ ఆఫీస్ ప‌రిస‌రాల్లో పెప్సీని తాగ‌కూడ‌ద‌ని ఉద్యోగుల‌కు నోటీసులు జారీ చేసింది. అని ఒక‌రు గుర్తుచేసుకున్నారు. ‘ఎక్కువ జీతం ఇస్తే ఈ నిబంధ‌న‌ను పాటించ‌డానికి నాకేం అభ్యంత‌రం లేదు’ అని ఒక‌రు.. ‘కొన్ని సంస్థ‌లు ఉద్యోగం ఇవ్వ‌లేమ‌ని చెప్ప‌కుండా ఇలాంటి చెత్త నిబంధ‌న‌లు పెడ‌తాయ‌’ని మ‌రొక‌రు వ్యాఖ్య‌నించారు.

ఒక యూజ‌ర్ త‌న‌కు జ‌రిగిన ఇలాంటి అనుభ‌వాన్నే పంచుకున్నాడు.. ‘ఒక రెస్టారెంట్‌లో ఉద్యోగం కోసం అప్లై చేశా. వారు న‌న్ను అక్క‌డికి దూరంగా వెళ్లి నాన్ వెజ్ (Non Veg) తినాల‌ని చెప్పేవారు. లేదా ఇంట్లోనే ఆహారం తీసుకుని ర‌మ్మనేవారు’ అని రాసుకొచ్చాడు.

అయితే మ‌రో యూజ‌ర్ దీనికి సానుకూలంగా స్పందించాడు. త‌మ‌ ఆలోచ‌న‌ల‌తో క‌లిసిపోయేవారినే కంపెనీలు కోరుకుంటాయి. ఇందులో కొత్తేమీ లేదు అని వ్యాఖ్యానించాడు. ఈ పోస్టుకు ఏకంగా 10 వేల కామెంట్లు రాగా.. ఈ అంశంపై పెద్ద ఎత్తున్ చ‌ర్చ జ‌రిగింది.