2 Men Filmed Video By Carrying A Crocodile | వీళ్లు మాములోళ్లు కాదురో..మొసలిని పట్టుకుని బైక్ రైడింగ్!

యువకులు బైక్ పై మొసలిని పట్టుకుని రైడ్ చేసి వీడియో వైరల్. నెటిజన్లు కామెంట్లు, వన్యప్రాణుల చట్టం పరిరక్షణపై సూచనలు చేస్తున్నారు.

2 Men Filmed Video By Carrying A Crocodile | వీళ్లు మాములోళ్లు కాదురో..మొసలిని పట్టుకుని బైక్ రైడింగ్!

విధాత : యువత చేసే సాహస కృత్యాలు ఒక్కోసారి వింతగా ఉంటూ..సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అలాంటి ఘటన ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాధారణంగా ఎవరైన పెంపుడు కుక్కలను..మేకలు గొర్రెలు.. లేక చిన్న చిన్న ఆవు దూడలు వంటి వాటిని మోటార్ బైక్ పై పట్టుకుని వెలుతుండటం చూస్తుంటాం. కాని ఓ ఇద్దరు యువకులు మరి ఎక్కడ పట్టారోగాని ఏకంగా మొసలిని పట్టుకుని బైక్ పెట్టుకుని పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ యువకులు ఏ మాత్రం భయం లేకుండా..మొసలిని పట్టుకుని బైక్ పై వెళ్లారు.

ఒకరు బైక్ నడుపుతుండగా..ఇంకొకరు వెనుక మొసలిని పట్టుకుని కూర్చున్నాడు. మొసలితో కలిసి ఇద్దరు బైక్ పై రయ్ రయ్ మంటూ వెళ్లారు. ఈ సమయంలో మొసలి వారి నుంచి తప్పించుకునేందుకుగాని..వారిపై దాడికి గాని ప్రయత్నించకుండా ఉండిపోవడం మరింత విస్మయంగా మారింది. ఇంతకాలం నీళ్లలో ప్రయాణించి బోరు కొట్టిందో..లేక బైక్ రైడింగ్ నచ్చిందో ఏమోగాని ఆ మొసలి వారి పెంపుడు మొసలి మాదిరిగా కదలకుండా గమ్మున కూర్చుని యువకులతో పాటు బైక్ రైడింగ్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీళ్లు మామాలోళ్లు కాదురో అని కొందరు..నేను, యువకులు ముగ్గురం రాజాసాబ్ కు సినిమాకు వెలుతున్నామంటూ అందులో హీరో ప్రభాస్ మొసలి ఫైటింగ్ సీన్ గుర్తు చేస్తూ మొసలి ఫీలింగ్ ఉందని మరికొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం వారి చర్య నేరమంటూ మరికొందరు గుర్తు చేస్తున్నారు.