BJP | ఈ నెల 29న ఖమ్మంకు అమిత్‌షా
BJP ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానున్న షెడ్యూల్ విధాత: తెలంగాణలో బీజేపీ బలోపేతం దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ మేరకు ఈనెల 29వ తేదీన ఖమ్మంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వచ్చే అవకాశం ఉంది. ఆయన పర్యటన షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానున్నది. ఈ మేరకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నది. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పధాది కారులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, […]

BJP
- ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానున్న షెడ్యూల్
విధాత: తెలంగాణలో బీజేపీ బలోపేతం దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ మేరకు ఈనెల 29వ తేదీన ఖమ్మంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వచ్చే అవకాశం ఉంది. ఆయన పర్యటన షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానున్నది.
ఈ మేరకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నది. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పధాది కారులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అలాగే ఆగస్ట్ 15 తరవాత రాష్ట్రం 119 నియోజక వర్గాల్లో 119 మంది ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యే ల వారం పాటు పర్యటన చే యాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు.
అలాగే బీఆరెస్S ఎమ్మెల్యే ల ఆస్తుల వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే తీరుగా రారంలో కేంద్ర ప్రభుత్వ పథకాల పైన హోర్డింగ్ లు పెట్టాలని, దళిత వాడల్లో కార్యకర్తలు ప్రతి రోజు తిరగాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.