Nizamabad | వరద బాధితులను ఆదుకోవాలి: బీజేపీ ధర్నా

Nizamabad విధాత, నిజామాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, నిజామాబాద్ మండలాలలో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోయి రైతుల పంట పొలాలు కొట్టుకుపోయాయని, ఇసుక మేటలు పెట్టి పంట నష్టం వాటిల్లిందని వారిని ఆదుకోవాలని కోరుతు బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. బీజేపీ రూరల్ ఇంచార్జి దినేష్ కులచారి మాట్లాడుతు ఎకరానికి 20 నుంచి 25000 ఖర్చు చేసి దుక్కి దున్ని, నారు […]

  • By: Somu    latest    Aug 04, 2023 12:42 AM IST
Nizamabad | వరద బాధితులను ఆదుకోవాలి: బీజేపీ ధర్నా

Nizamabad

విధాత, నిజామాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, నిజామాబాద్ మండలాలలో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోయి రైతుల పంట పొలాలు కొట్టుకుపోయాయని, ఇసుక మేటలు పెట్టి పంట నష్టం వాటిల్లిందని వారిని ఆదుకోవాలని కోరుతు బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు.

బీజేపీ రూరల్ ఇంచార్జి దినేష్ కులచారి మాట్లాడుతు ఎకరానికి 20 నుంచి 25000 ఖర్చు చేసి దుక్కి దున్ని, నారు పోసి పంటలు వేసుకున్న రైతులకు తీరని నష్టం వాటిలిందని ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు.

భారీ వర్షాలతో కొన్ని గ్రామాలలో ఇల్లు, రాకపోకలకు సంబంధించిన బ్రిడ్జిలు కొట్టుకుపోవడం జరిగిందని రోడ్ల బాగు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని అభివృద్ధిని చేయలేక విఫలమయ్యారని అన్నారు.

రూరల్ లో జక్రాన్ పల్లి కి చెందిన యాదవ కుటుంబానికి చెందిన అమ్మాయిని లవ్ జిహాద్ తో తీసుకెళ్లడం తో తండ్రి ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమన్నారు. పోలీసులు మాత్రం ఆత్మహత్య కాదని సహజమరణమేనని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఆడ పిల్లలను కన్న తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఇలాంటివి జరగడానికి కారణం నాయకులే కారణమని అన్నారు.