Bv Raghavulu |
విధాత: కమ్యూనిస్టులున్నంతకాలం తెలంగాణలో బిజెపికి స్థానం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ హోటల్ లో మంగళవారం నియోజవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితులు- మన కర్తవ్యాలు అనే అంశంపై మాట్లాడారు. ప్రజా ఉద్యమాలు ఉన్న ప్రాంతాలలో బిజెపి ఆటలు సాగమని చెప్పారు. బిజెపి మత రాజకీయాలు చేస్తుందని, ఆ ప్రమాదం నుండి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాల వైపు తిప్పాలని కోరారు.
ప్రజా ఉద్యమాలకు అండగా ఉండటానికి శాసనసభలో కమ్యూనిస్టులు పార్టీల ప్రాతినిధ్యం అవసరమని చెప్పారు. అఖిల భారత కమిటీ నిర్ణయం మేరకు ఆయా రాష్ట్రాలలో సర్దుబాటు చేసుకునే వీలుందని చెప్పారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న కలిసిపోతున్నామని చెప్పారు. 12 శాతం జనాభా ఉన్న ముస్లింల సహకారంతోనే ఇప్పటివరకు పార్టీలు అధికారంలోకి చేపట్టారని గుర్తు చేశారు.
సంక్షేమ పథకాలు అభివృద్ధి కొంతవరకు ఓట్లు రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధానంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారానే అత్యధిక ఓట్లు సాధించవచ్చు అని చెప్పారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. మోడీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం లౌకిక వాదం ధ్వంసం అవుతుంది అన్నారు. మోడీకి మళ్లీ అధికారం ఇస్తే దేశాన్ని పూర్తిగా మత రాజకీయంగా మారుతాడని ఆరోపించారు. మోడీ వస్తే రైస్ మిల్లులని ఆదాని రైస్ మిల్లులుగా మారిపోతాయని చెప్పారు.
నల్ల చట్టాలు మళ్లీ అమలు చేసే అవకాశం లేకపోలేదని తెలిపారు. ఇప్పటికీ ఎరువులు, గ్యాస్ పై సబ్సిడీలు ఎత్తేసి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగేందుకు కారణమయ్యారని విమర్శించారు. ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసేందుకు మత ప్రచారాన్ని తీసుకొస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతుందని ఆరోపించారు.
ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. చివరికి అప్పులు తెచ్చుకున్నందుకు కూడా కేంద్రం అనుమతి తీసుకున్న పరిస్థితి ఏర్పడిందని వారు చెప్పే పథకాలు అమలు చేస్తేనే అప్పులు పుట్టుతున్నాయని అందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందంజలో ఉన్నాడని తెలిపారు.
ఉత్తర భారత దేశంలో మోడీకి మిత్రులు తగ్గిపోతున్నారని దానిని కవర్ చేసుకునేందుకు దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలంగాణపై ఫోకస్ పెట్టారని చెప్పారు. అక్కడ సీటు తగ్గిన ఇక్కడ వచ్చిన సీట్లతో సర్దుబాటు చేసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో మోడీ ఉంటే ప్రతిపక్షాలు కనుమరుగు అవుతాయని తెలిపారు. మోడీ విధానాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు డి.మల్లేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్ సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
త్రిపుర సిపిఎం కార్యకర్తల సహయార్థం 16.200 అందజేత
త్రిపుర రాష్టంలో జరుగుతన్న హింసాకాండ సిపిఎం కార్యకర్తలు అన్యాయనికి గురౌతున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం కార్యకర్తలకు సంఘీభావంగా వారిని ఆదుకోవాలని కోరగా ముఖ్యకార్యకర్తల స్పందించారు. ఎవరికి తోచిన వారు తమ వంతు సహాయంగా అందజేశారు. మొత్తంగా 16,200 రూపాయలు అందించారు. ఆ విరాళాలను త్రిపుర కమిటీకి అందజేస్తామని చెప్పారు.