రాముడి మీద కాదు..ఓట్ల మీదనే బీజేపీకి ప్రేమ

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం పేరుతో హడావుడి చేస్తున్న బీజేపీ పార్టీ.

♦ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ధ్వజం

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం పేరుతో హడావుడి చేస్తున్న బీజేపీ పార్టీ ప్రేమంతా నిజానికి రాముడు మీద కాదని, హిందూ ఓట్ల మీద మాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, వి.హనుమంతరావు విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాముడిని కూడా రాజకీయాల్లో లాగి ఓట్లు సంపాదించాలని బీజేపీ చూస్తుందన్నారు. అయోధ్య లో గుడి కట్టారని, దేవుడి మీద భక్తి ఉన్నవారంతా పోయి దర్శించకుంటారని, పిలిచినప్పుడే రావాలి అన్నట్లుగా ప్రధాని మోడీ వ్యవహారం ఉందన్నారు.


దేవుడి వద్దకు వెళ్లడానికి ఇన్విటేషన్ ఎందుకన్నారు. మోడీ పిలిచినప్పుడే ఎందుకు వెళ్లాలని..మాకు పోవాలి అనిపించినప్పుడు పోతామన్నారు. రాముడి గుడి ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని చెప్పి కాంగ్రెస్ రాముడికి వ్యతిరేకమని చెప్పి రాముడికి కాంగ్రెస్‌కు పేచి పెడుతున్నారన్నారు. 25 కోట్ల పేదలను ధనికులను చేశామని మోడీ చెప్పడం చూసి నవ్వాలా ..ఏడవాలో అర్థం కాలేదన్నారు. ఇంతకంటే అబద్ధం ఇంకోటి లేదు మోడీ కార్పోరేట్ సెక్టార్ వాళ్లకే లాభం చేస్తున్నారు తప్ప పేదలకు చేసేదేమిలేదన్నారు. రైతులకు మద్దతు ధర పెంచండి అని అడిగితే ఇప్పటికి ఇవ్వలేదన్నారు. నోట్ల రద్దు చేసి..చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళను రోడ్డున వేశాడని, అంబానీని మించి ఆస్తిపరుడు ఆదానీ అయ్యాడంటే అందుకు మోడీనే కారణమన్నారు