Vijayashanti: గోసంరక్షణ ముసుగులో బీజేపీ మత రాజకీయాలు : విజయశాంతి
Vijayashanti : గోసంరక్షణ ముసుగులో బీజేపీ మత రాజకీయాలు..విభజన రాజకీయాలు సాగిస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి విమర్శించారు. బక్రీద్ పండుగ సమయంలో మాత్రమే బీజేపీకి, దాని మిత్రపక్షాలకు గో సంరక్షణ గుర్తుకొస్తుందని.. మిగిలిన ఏడాదంతా వేలకు వేలుగా గోవులు కబేళాలకు తరలిపోతున్నా పట్టించుకోరంటూ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఒకవేళ ఒకటీ అరా ఆపినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రక్తపాతం సృష్టించడం చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. బక్రీద్ తరుణంలో కొందరు గోవులను దొంగ చాటుగా కబేళాలకు తరలించే అవకాశం ఉందన్న ఆరోపణలు ఎవరిని ఉద్దేశించి చేశారో కానీ.. ఒక మతం పేరిట ఇలాంటి విభజన పూర్తిగా ఖండనీయమని పేర్కొన్నారు.
గోవును జాతీయ ప్రాణిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని బీజేపీయే ఒక వర్గంతో డిమాండ్ చేయిస్తుంది కానీ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఆ పని ఎన్నటికీ చెయ్యదని విజయశాంతి విమర్శించారు. ఎందుకంటే గోసంరక్షణ సమస్య పరిష్కారం కంటే, రాజకీయంగా ఈ వివాదాన్ని అలాగే కొనసాగించడం బీజేపీతో పాటు ఎన్డీయే పక్షాల అజెండా అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram