Bodybuilder Bride: కండలు తిరిగిన వధువు.. చూశారంటే ఫిదా!
Bodybuilder Bride | wedding look went viral
ఏదో ఒక కారణంతో కొందరు పెళ్లికూతుళ్ల వీడియోలు వైరల్ కావడం చూస్తూనే ఉంటాం. ఈ వధువు కూడా ఇలానే వైరల్ అయింది. ఎందుకంటే.. ఆ పెళ్లి కూతురు అలాంటిలాంటి పెళ్లికూతురుకాదండోయ్.. కండలు తిరిగిన వధువు! అర్థం కాలేదా? లేడీ బాడీబిల్డర్! సిక్స్‌ప్యాక్ బాడీతో, ఉక్కు స్తంభాల్లాంటి చేతులతో ఉన్న ఆ ఫిట్‌నెస్ ట్రైనర్ ఒక్కసారిగా వధువు అవతారం దాల్చేసరికి అందరూ ఫిదా అయిపోయారు.

కర్ణాటకలో లేడీ బాడీ బిల్డర్‌గా ప్రఖ్యాతి పొందారు చిత్ర పురుషోత్తం. అటు సంప్రదాయాన్ని, తన శక్తిని మేళవించిన చిత్ర.. పసుపు, నీలం రంగులతో కూడిన కాంజీవరం చీరను ధరించి, తన కండలు తిరిగిన శరీరాన్ని ప్రదర్శిస్తూ ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో ఆమె బ్లౌజ్ ధరించలేదు. అయితే.. కమర్ బంద్, మాంగ్ టిక్కా, చెవిపోగులు, గాజులు వంటి సంప్రదాయ బంగారు ఆభరణాలతో ఇచ్చిన లుక్.. అదిరిపోయింది. దానికి తోడు బ్రైడల్ మేకప్, కాటుక, ఎర్రటి లిప్ స్టిక్‌తో చక్కగా దువ్విన తలకు మల్లెపూలు జోడించి.. వహ్వా అనిపించింది.
తన రెండు బైసెప్స్‌ను చూపిస్తూ చేసిన ఆ వీడియో కింద మైడ్‌సెట్ ఈజ్ ఎవ్రీథింగ్.. అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ వీడియో వైరల్‌గా మారి.. 7 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నది. చిత్ర పురుషోత్తంకు ఇన్‌స్టాలో 1.38 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె అనేక అందాల పోటీల్లో పాల్గొని టైటిల్స్ గెలిచింది. ఆ టైటిళ్లలో మిస్ ఇండియా ఫిట్‌నెస్, వెల్‌నెస్, మిస్ సౌత్ ఇండియా, మిస్ కర్ణాటక వంటివి కూడా ఉన్నాయి. తన దీర్ఘకాల మిత్రుడు కిరణ్‌రాజ్‌ను చిత్ర వివాహం చేసుకున్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram