Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..సముద్రంపై చక్కర్లు !
న్యూఢిల్లీ : అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిన పెను ప్రమాదాన్ని మరువక ముందే మరో ఎయిరిండియా విమానం ప్రయాణికులకు ప్రాణభయానికి గురి చేసింది. థాయిలాండ్ పుకేట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా 369 విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. అధికారులు ఈ విమానాన్ని తిరిగి థాయిలాండ్ కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ క్రమంలో విమానం అండమాన్ సముద్రంపై కొంతసేపు చక్కర్లు కొట్టింది. విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏం జరుగుతుందో అర్దం కాక ప్రయాణికులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమని గడిపారు.
చివరకు విమానాన్ని అత్యవసరంగా తిరిగి థాయిలాండ్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండ్ కాగానే బాంబు స్క్వాడ్ బృందం విమానంలో తనిఖీలు నిర్వహించింది. అయితే ఎలాంటి బాంబు లేదని తేలింది. బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై అధికారులు దృష్టి సారించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram