Jagdish Reddy | సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి: మంత్రి జగదీశ్ రెడ్డి
Jagdish Reddy | విధాత : బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామ దేవతలను ఆరాధించి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం శతాబ్దాల క్రితం మొదలైందన్నారు. అటువంటి అనవాయితీని కొనసాగిస్తూ క్రమశిక్షణతో బోనాల పండుగ నిర్వహించుకుంటున్న సూర్యాపేట పట్టణ ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఊర ముత్యాలమ్మ బోనల పండుగను పురస్కరించుకుని మంత్రి […]
Jagdish Reddy |
విధాత : బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామ దేవతలను ఆరాధించి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం శతాబ్దాల క్రితం మొదలైందన్నారు.
అటువంటి అనవాయితీని కొనసాగిస్తూ క్రమశిక్షణతో బోనాల పండుగ నిర్వహించుకుంటున్న సూర్యాపేట పట్టణ ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఊర ముత్యాలమ్మ బోనల పండుగను పురస్కరించుకుని మంత్రి జగదీశ్ రెడ్డి, ఆయన సతీమణి సునీతా జగదీశ్ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజలపై ఊర ముత్యాలమ్మ కరుణా కటాక్షాలు చూపాలని ప్రార్దించినట్లు ఆయన వెల్లడించారు. ప్రకృతికి అనుకూలంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నందున ఊర ముత్యాలమ్మతో పాటు ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు పడేలా చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా పంటలు బాగా పండి ప్రజల ఆదాయం పెరగాలని ముత్యాలమ్మ తల్లికి విన్నవించుకున్నట్లు చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram