భువనగిరిలో బీజేపీ గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా: మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ సవాల్‌

భువనగిరి లోక్‌సభ స్థానంలో బీజేపీ గెలవకపోతే తాను శాశ్వతంగా రాజకీయ రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నేను గెలిస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తా

భువనగిరిలో బీజేపీ గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా: మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ సవాల్‌

నేను గెలిస్తే కోమటిరెడ్డి మంత్రిపదవికి రాజీనామా చేయాలి

విధాత : భువనగిరి లోక్‌సభ స్థానంలో బీజేపీ గెలవకపోతే తాను శాశ్వతంగా రాజకీయ రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నేను గెలిస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తాడా అని బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ సవాల్ చేశారు. నా సవాల్‌ను స్వీకరించే దమ్ము, ధైర్యం కోమటిరెడ్డికి ఉందా అని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. గురువరాం ఆయన భువనగిరి లోక్‌సభ నియోజవర్గం పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై, గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూర మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తాను ఎంపీగా ఉన్న సమయంలో బీబీనగర్ ఎయిమ్స్‌, ఎంఎంటీఎస్ రలు, కేంద్రీయ విద్యాలయం, 520కిలోమీటర్ల జాతీయ రహదారులు తీసుకొచ్చానని తెలిపారు.


నియోజకవర్గం అభివృద్ధిపై కోమటిరెడ్డి సోదరులు తనతో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కొంతమంది బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీఆరెస్‌, బీజేపీ ఒక్కటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిని చెప్పుతో కొడుతామని హెచ్చరించారు. బీజేపీ తెలంగాణలో అన్ని ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడుతుందని, రాష్ట్రంలో బీజేపీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. ప్రజలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన పట్ల నమ్మకంతో ఉన్నారన్నారు. మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాబోతుందని ఇప్పటికే ప్రజలు అర్ధం చేసుకుని మద్దతునిస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం రామమందిర నిర్మాణ హామీతో పాటు 370ఆర్టికల్ రద్దు, సీఏఏ అమలు, మహిళా రిజర్వేషన్ బిల్లు సహా కీలక హామీలన్ని అమలు చేసిందన్నారు. దేశ భద్రతను, ఆర్ధిక శక్తిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లారని వివరించారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం రాబోతున్నందునా భువనగిరిలో బీజేపీ ఎంపీ గెలిస్తే అభివృద్ధి పరుగులు పెట్టనుందని తెలిపారు.