దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీతోనే సాధ్యం:మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీతోనే సాధ్యమని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఎంపీలను గెలిపించడం ద్వారా మరోసారి కేంద్రంలో

విధాత : దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీతోనే సాధ్యమని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఎంపీలను గెలిపించడం ద్వారా మరోసారి కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం తెచ్చుకోవాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో గావ్ ఛలో కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ లంక బిందెలు కావాలనుకునే కాంగ్రెస్ నేతలను ఓడించి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేయడంతో జమ్మూ కాశ్మీర్లో శాంతి, ప్రగతి స్థాపించిన ఘనత మోడీదేనన్నారు. నారి శక్తి వందనం అంటూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత మోడీదేనన్నారు. గతంలో దేశ ప్రగతి 11 స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత మోడీదేనన్నారు. తాను క్యాష్ అండ్ క్యారీ నాయకుడిని కాదని, ప్రజా సంక్షేమం పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడినన్నారు. గతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి 365 జాతీయ రహదారి, గ్రామాలలో సీసీ రోడ్లు వేయించానన్నారు. నేను ఈ ప్రాంత బిడ్డను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. భువనగిరి నుంచి తనను బీజేపీ ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మూడోసారి రానున్న మోడీ బీజేపీ ప్రభుత్వం అండతో తాను నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో పనులు చేయించగలనని, ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని తనను గెలిపించాలన్నారు.