Viral Video | ఏం ధైర్యం రా బాబు.. సింహాల‌తో బాలుడి ఆట

Viral Video | పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్క‌ల‌తో చిన్న పిల్ల‌లు స‌ర‌దాగా ఆడుకున్న ఘ‌ట‌న‌లు చూశాం. ఆ జంతువులు కూడా పిల్ల‌ల‌తో ప్రేమ‌గా మెలుగుతాయి. కానీ ఈ బాలుడు మాత్రం ఏకంగా సింహాల‌తోనే ఆడుకున్నాడు. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా వాటితో స‌ర‌దాగా గ‌డిపాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఓ రెండు సింహాల‌ను ఇంట్లోనే పెంచుకుంటున్న‌ట్లు ఆ వీడియోలో క‌నిపిస్తుంది. అయితే ఆ సింహాల వ‌ద్ద‌కు ప‌దేండ్ల వ‌య‌సున్న ఓ బాలుడు […]

Viral Video | ఏం ధైర్యం రా బాబు.. సింహాల‌తో బాలుడి ఆట

Viral Video | పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్క‌ల‌తో చిన్న పిల్ల‌లు స‌ర‌దాగా ఆడుకున్న ఘ‌ట‌న‌లు చూశాం. ఆ జంతువులు కూడా పిల్ల‌ల‌తో ప్రేమ‌గా మెలుగుతాయి. కానీ ఈ బాలుడు మాత్రం ఏకంగా సింహాల‌తోనే ఆడుకున్నాడు. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా వాటితో స‌ర‌దాగా గ‌డిపాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ఓ రెండు సింహాల‌ను ఇంట్లోనే పెంచుకుంటున్న‌ట్లు ఆ వీడియోలో క‌నిపిస్తుంది. అయితే ఆ సింహాల వ‌ద్ద‌కు ప‌దేండ్ల వ‌య‌సున్న ఓ బాలుడు వ‌చ్చాడు. సింహానికి ముద్దు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా, సింహాం కూడా అత‌ని ముఖంపై దాడి చేసేలా ప్ర‌వ‌ర్తించింది.

ఆ త‌ర్వాత ఆ అబ్బాయి త‌న చేతిని సింహాం నోట్లో పెట్టాడు. కానీ అది ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు. మ‌రో సింహాం చెంపై బాలుడు ముద్దుగా కొట్టాడు. ఓ కుక్క‌తో ఆడుకున్న మాదిరిగా సింహాల‌తో ఆడుకున్న బాలుడి వీడియో నెట్టింట హల్‌చ‌ల్ చేస్తోంది. ఆ వీడియోపై మీరు ఒక‌సారి లుక్కేయండి..