Lover Murder | గ‌ర్భం దాల్చిన ప్రియురాలు.. పెళ్లికి ఒత్తిడి చేయ‌డంతో హ‌త్య‌

Lover Murder | ప్రేమిస్తున్నాని న‌మ్మించాడు. పెళ్లి చేసుకుంటాన‌ని వంచించాడు. చివ‌ర‌కు ప్రియురాలు గ‌ర్భం దాల్చాక ముఖం చాటేశాడు. పెళ్లికి ఒత్తిడి తేవ‌డంతో ఆమెను హ‌త్య చేశాడు ఓ వ్య‌క్తి. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మీర‌ట్ జిల్లాకు చెందిన రాంబిరి అనే యువ‌తికి 2015లో వినోద్ అనే యువ‌కుడితో వివాహ‌మైంది. ఏడాది త‌ర్వాత వీరిద్ద‌రు విడిపోయాడు. అప్ప‌ట్నుంచి రాంబిరి తల్లిదండ్రుల వ‌ద్దే ఉంటోంది. ఈ క్ర‌మంలో ఆదేశ్ […]

Lover Murder | గ‌ర్భం దాల్చిన ప్రియురాలు.. పెళ్లికి ఒత్తిడి చేయ‌డంతో హ‌త్య‌

Lover Murder | ప్రేమిస్తున్నాని న‌మ్మించాడు. పెళ్లి చేసుకుంటాన‌ని వంచించాడు. చివ‌ర‌కు ప్రియురాలు గ‌ర్భం దాల్చాక ముఖం చాటేశాడు. పెళ్లికి ఒత్తిడి తేవ‌డంతో ఆమెను హ‌త్య చేశాడు ఓ వ్య‌క్తి. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మీర‌ట్ జిల్లాకు చెందిన రాంబిరి అనే యువ‌తికి 2015లో వినోద్ అనే యువ‌కుడితో వివాహ‌మైంది. ఏడాది త‌ర్వాత వీరిద్ద‌రు విడిపోయాడు. అప్ప‌ట్నుంచి రాంబిరి తల్లిదండ్రుల వ‌ద్దే ఉంటోంది. ఈ క్ర‌మంలో ఆదేశ్ అనే వ్య‌క్తితో రాంబిరికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇది కాస్త ప్రేమ‌కు దారి తీసింది. పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి ఆమెను ప‌లుమార్లు శారీర‌కంగా క‌లిశాడు. దీంతో రాంబిరి గ‌ర్భం దాల్చింది. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఆదేశ్‌పై రాంబిరి ఒత్తిడి తెచ్చింది.

ఆదేశ్‌కు ఆమెను పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేదు. ఎలాగైనా రాంబిరిని మ‌ట్టుబెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నా డు. దీంతో జులై 2వ తేదీన త‌న ఇంటికి రావాల‌ని ఆమెకు చెప్పాడు. రాంబిరి ఇంటికి రాగానే త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆమెను దారుణంగా హ‌త్య చేశాడు. అనంత‌రం స‌మీపంలో ఉన్న పొలంలో రాంబిరి మృత‌దేహాన్ని ప‌డేసి పరారయ్యారు.

మ‌హిళ మృత‌దేహాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆదేశ్‌తో పాటు మ‌రో న‌లుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని రాంబిరి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు.