రిసెప్షన్‌కు వెళుతూ.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన కొత్త జంట
విధాత: అంగరంగ వైభవంగా పెళ్లి (Newlyweds) చేసుకున్నారు. ఆత్మీయుల కోసం పెద్ద హోటల్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. పై అంతస్థులోని రిసెప్షన్ హాల్‌కు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు వెళుతుండగా జరిగిన అనుకోని ఘటన.. వారు జీవితాంతం నవ్వుకునేలా చేసింది! ప్రణవ్, విక్టోరియా ఝా అనే నూతన దంపతులు తమ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు నార్త్ కరోలినాలోని గ్రాండ్ బొహెమియాన్ (Grand Bohemian hotel) హోటల్‌లో లిఫ్ట్ ఎక్కారు. పదహారో అంతస్థులో విందుకు వెళ్లాల్సి ఉన్నది. వారితో […]

విధాత: అంగరంగ వైభవంగా పెళ్లి (Newlyweds) చేసుకున్నారు. ఆత్మీయుల కోసం పెద్ద హోటల్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. పై అంతస్థులోని రిసెప్షన్ హాల్‌కు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు వెళుతుండగా జరిగిన అనుకోని ఘటన.. వారు జీవితాంతం నవ్వుకునేలా చేసింది!
ప్రణవ్, విక్టోరియా ఝా అనే నూతన దంపతులు తమ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు నార్త్ కరోలినాలోని గ్రాండ్ బొహెమియాన్ (Grand Bohemian hotel) హోటల్‌లో లిఫ్ట్ ఎక్కారు. పదహారో అంతస్థులో విందుకు వెళ్లాల్సి ఉన్నది. వారితో పాటు మరో నలుగురు కూడా ఎలివేటర్ (Elevator)లో ఉన్నారు. అప్పడు అనుకోకుండా లిఫ్ట్ మొరాయించింది.
దాంతో.. రిసెప్షన్‌కు వెళ్లాల్సిన వారు కాస్తా.. రెండు గంటల పైనే లిఫ్ట్‌లోనే గడపాల్సి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. లిఫ్ట్ పనిచేయలేదు. ఆఖరుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి వారిని ‘హేస్టీ సీట్’ (బెల్టులతో తయారు చేసేది) తాళ్లతో సురక్షితంగా బయటకు తీశారు. ‘లిఫ్ట్ ఎక్కాక కొన్ని క్షణాల్లోనే లిఫ్ట్ ఆగిపోయింది. కాకపోతే డోర్ కాస్త తెరుచుకుని ఉన్నది.
దీంతో కాస్త ఊపిరి పీల్చుకోగలిగాం’ అని ప్రణవ్ ఒక టెలివిజన్ ప్రతినిధికి చెప్పాడు. ‘మా ఇద్దరిలో ఎవరో ఒకరు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఉంటే.. ఏం జరిగిదో కానీ.. ఎంచక్కా ఇద్దరం కలిసే ఇందులో ఉండి పోయాం..’ అంటూ కొత్త పెళ్లికూతురు విక్టోరియా ముసిముసి నవ్వులు నవ్వింది. రిసెప్షన్‌కు రాకుండా డైరెక్టుగా హనీమూన్‌కు వెళ్లిపోయారేమోనని అనుకున్నాం.. అంటూ వారి స్నేహితులు సరదాగా ఆటపట్టించారు.