కన్యత్వ పరీక్షకు డిమాండ్.. ఆ సమయంలో షాకిచ్చిన కొత్త అల్లుడు
Bride Virgin Test | కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య పెళ్లి ఘనంగా జరిగింది. అప్పగింతల సమయం రానే వచ్చింది. భారమైన హృదయంతో పుట్టింటిని వీడి వెళ్తున్న బిడ్డ బాధను చూసి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తమ కూతురికి ఎలాంటి ఇబ్బందులు పెట్టమని పేపర్ మీద రాసివ్వండని వారు వియ్యంకుల వారిని అడిగారు. దీంతో అల్లుడికి కోపం వచ్చింది. అత్తగారికి షాకిచ్చాడు అల్లుడు.. వధువుకు కన్యత్వ పరీక్ష చేయించండి అని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అక్కడున్న […]

Bride Virgin Test | కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య పెళ్లి ఘనంగా జరిగింది. అప్పగింతల సమయం రానే వచ్చింది. భారమైన హృదయంతో పుట్టింటిని వీడి వెళ్తున్న బిడ్డ బాధను చూసి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తమ కూతురికి ఎలాంటి ఇబ్బందులు పెట్టమని పేపర్ మీద రాసివ్వండని వారు వియ్యంకుల వారిని అడిగారు.
దీంతో అల్లుడికి కోపం వచ్చింది. అత్తగారికి షాకిచ్చాడు అల్లుడు.. వధువుకు కన్యత్వ పరీక్ష చేయించండి అని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన బీహార్‌లోని తుర్కౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 17న చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ తుర్కౌలియా పోలీసు స్టేషన్ పరిధిలోని మోతిహరికి చెందిన ఓ జంటకు నవంబర్ 16వ తేదీన పెళ్లి చేశారు. 17వ తేదీన వధువును వరుడి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు, బంధువులు కలిసి.. తమ బిడ్డకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది పెట్టమని చెప్పి పేపర్ మీద రాసివ్వాలని అడిగారు.
దీంతో అల్లుడు గారికి తీవ్రమైన కోపం వచ్చింది. ఇంకేముంది.. మరి ఆమెకు కూడా కన్యత్వ పరీక్ష చేయించమని డిమాండ్ చేశారు. దీంతో కోపంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులు.. వరుడితో పాటు వారి చుట్టాలను బంధించారు. ఈ విషయం పోలీసుల దాకా చేరింది. మోతిహరికి చేరుకున్న పోలీసులు.. ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి.. వరుడిని విడిపించారు. కానీ పెళ్లి కూతురు మాత్రం అత్తగారింటికి వెళ్లలేదు.