గూగుల్ క్రోమ్ ఇన్‌కాగ్నిటోలో బ్రౌజ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త
ప్రతి ఒక్కరూ ఏదైనా అవసరం పడితే గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. సెర్చ్ చేసిన సమయంలో హిస్టరీ, డౌన్‌లోడ్స్‌కు సంబంధించిన వివరాలన్నీ గూగుల్‌లో రికార్డవుతాయి

Google | ప్రతి ఒక్కరూ ఏదైనా అవసరం పడితే గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. సెర్చ్ చేసిన సమయంలో హిస్టరీ, డౌన్‌లోడ్స్‌కు సంబంధించిన వివరాలన్నీ గూగుల్‌లో రికార్డవుతాయి. అదే బ్రౌజర్‌ను మళ్లీ వేరేవాళ్లు వాడిన సందర్భంలో సెర్చ్ హిస్టరీ చూస్తే బయటపడిపోతుంది. సెర్చ్ చేసిన తర్వాత బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేస్తుంటారు. అయినా గూగుల్‌నే అన్నీ నిక్షిప్తమవుతాయి. మరికొందరు గూగుల్ ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజ్ చేస్తుంటారు. దీన్ని వాడడం వల్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కలుగదని భావిస్తుంటారు.
అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేసినా గూగుల్ మీపై ఓ కన్నేసి వివరాలన్నీ ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఇదే విషయాన్ని కంపెనీ సైతం ఇటీవల ఒప్పుకున్నది. యూజర్ల ప్రైవసీ కోసం ఇన్‌కాగ్నిటో మోడ్‌ను తీసుకువచ్చినట్లు గూగుల్ గతంలో ప్రకటించింది. దీంతో యూజర్స్ సెక్యూరిటీకి ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పింది. అయితే, ఇదంతా అబద్ధమేనని తేలింది. యూజర్స్ యాక్టివిటీస్‌ను గూగుల్ చట్టవిరుద్ధంగా ట్రాక్ చేస్తున్నట్లు ఆరోపించగా.. అమెరికాలో కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలు నిజమేనని గూగుల్ సైతం ఒప్పుకున్నది. యూజర్లకు తెలియకుండా సెర్చ్ హిస్టరీని, బుక్ మార్క్స్‌ను, డౌన్లోడ్స్ను పూర్తిగా ట్రాక్ చేస్తున్నట్లు అంగీకరించింది.
ఈ సందర్భంగా గూగుల్ యూజర్లకు స్పష్టత ఇచ్చింది. ఇన్‌కాగ్నిటో మోడ్ ఉపయోగించినా తప్పనిసరిగా యూజర్స్ డేటాను ట్రాక్ చేస్తామని స్పష్టం చేసింది. అయితే, ఇకపై ఇన్‌కాగ్నిటో మోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇదిలా ఉండగా.. గూగుల్ క్రోమ్ యూజర్స్ కోసం సరికొత్తగా మూడు ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. వీటి సహాయంతో ట్యాబ్స్‌ను నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేసుకోవడంతో పాటు కస్టమ్స్ థీమ్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చని పేర్కొంది. వెబ్ పేజెస్‌లో ఏమైనా రాయాలని అనుకుంటే (Help me write) అనే ఏఐ రైటింగ్ అసిస్టెంట్‌ను వాడుకోవచ్చని చెప్పింది. ఆన్లైన్ ఫామ్స్, ఈ-మెయిల్స్, ఆన్లైన్ రివ్యూస్ రాసే సమయంలో సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని గూగుల్ వివరించింది.